Sunday, October 11, 2009

వరద ముంపు గ్రామాల్లో మా పర్యటన

                        రాష్ట్రమంతా వరదల గురించే చర్చ ,గంటల వ్యవదిలో కర్నూలు ,మహబూబ్ నగర్ జిల్లాలు మునిగిపోవటం ,ప్రజలందరు నిరశ్రేయులవటం ,కట్టలు  తెగిపోవటం .చాలబాదవేసింది ఛానల్స్ పోటీపడి ఆ దృశ్యాలని చూపిస్తున్నాయి .భాదితులతోపాటు  మీడియా వాళ్ళు కూడా పీకల లోతులో దిగి లైవ్ ప్రోగ్రాం చూపించటం .చూస్తకి క్రిష్నమ్మ ఉగ్రరూపం చాల భయంకరంగా  ,ఇంకోవైపు డమ్స్ నుంచి వచ్చే నీరు అందంగా పరవళ్ళు తొక్కుతూ (చూడటానికి రెండు కళ్ళు చాలవు ) .క్షణం క్షణం ఉత్కంఠ ,భయం,టెన్షన్ .వరదలు ఇప్పుడు గుంటూరు ,కృష్ణ జిల్లాలని ముంచెయ్యపోతున్నాయి, ప్రాణాలను రక్షించుకోందని చానల్స్ ,అధికారుల హెచ్చరికలు . టి. వి చూడకూడదు అనుకుంటూనే చూడటం .ఇలాకాదు డైరెక్ట్ గ వెళ్లి  పరిస్థితి చూడాలి అనుకున్నాను .
                                 మర్నాడు (అక్టోబర్ నాలుగు ) మా ఫ్రెండ్స్ బృందం ఎనిమిదిమంది ,అందరికి సోషల్ సర్వీసు అంటే ఇష్టం .గుంటూరు ,కృష్ణ జిల్లాలలో పర్యటించాలని అనుకున్నాము .ముందుగ కృష్ణకి వెళ్ళాలని ,ఇదు వేల పులిహార,పెర్గుఅన్నం పాకెట్స్ ,వాటర్ పాకెట్స్,   పెద్ద వేహికాల్స్ లో బయలు దేరేము . ప్రకాశం బరేజ్ అప్పటికి సందర్సకులని రానివ్వటంలేదు ,బరేజ్కి ఇవతల నుంచి చూసేము .కృష్ణమ్మా ఉగ్ర రూపం చాల భయంకరంగా   ఉంది .అక్కడ్నుంచి కరకట్ట ప్రాంతాలకి వచేము .దాదాపు ఇళ్ళని మునిగిపోయి అంత నదిలగా కనిపిస్తుంది.సగంమంది పునరావాస కేంద్రాలకి వెళ్ళేరు .సగంమంది కట్టమేదే వున్నారు 'ఎందుకు వెళ్ళలేదని 'అడిగితె,ఇంటిలో సామాను దొంగలు తిసుకుపోతరేమోనని వెల్లడము లేదని చెప్పేరు .కృష్ణమ్మా, దాదాపు కరకట్టని ఆనుకుని ప్రవహిస్తుంది .రాత్రికి పూర్తిగా మునిగిపోతుంది అనే భయం తో ఉన్నారు .పోలీసు సిబ్బంది యవ్వరిని దగరకు  వేల్లనివ్వటం లేదు .కొన్నిపెకేత్స్ వారికీ ఇచ్చి ,రామలింగేస్వర్ నగర్ బాగా మునిగిపోయిందంతా ,అక్కడికి బయలుదేరేము .దారిలోపునరవాసు కేంద్రాలని చూసేము ,వారికీ చాల మంచి ఆహరం ఇస్తున్నారు ,అన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు .
                                            బాగా ముంపుకు గురయిన లంకగ్రమల వైపు బయలు దేరేము.తొట్లవల్లూరు,ఘంటసాల,మోపిదేవి, చల్లప ,అవనిగడమండలాలలోని గ్రామాలన్నీ  మునిగాయంత, ముందుగ తొట్లవల్లూరు వేల్లేము,ప్రజప్రతినిదులు చాలమంది ఉన్నారు.నది ఒక సముద్రాన్ని తలపిస్తుంది ,ప్రవాహం ఉదృతంగా ఉంది .నీళ్ళు కట్టమీదకి  వచాయి మేము నిలబడితే మాకాళ్లని    తాకు తున్నాయి .కనుచూపుమేర లంక గ్రామాలూ కనిపించడం లేదు .అక్కడి ప్రజలు  సగంమంది గ్రామంలోనే ఉన్నారంట .వాళ్ళకి ప్రానలకన్నవారి ఆస్తులే ముఖ్యం అనిపించింది .మీడియావారు, పోలీసు సిబ్బంది దుమ్ముకోట్టుకుని చింపిరిజుట్టులుతో ఉన్నారు .రాత్రి,పగలు కూడా అక్కడే ఉంటున్నరంట్ట .పొదున్నించి టిఫ్ఫెన్ కూడా తినలేదు అన్నరు ,అప్పటికి పదకొండు దాటింది మా దగ్గర ఉన్న ఫుడ్ పాకెట్స్ ఇచ్చేము .లంక గ్రామలవారి కోసం సిబ్బందే భోజనం తిసుకువేలుతున్నారు,వారితోపాటు మీడియావారు అంతప్రవాహంలో చిన్న బోట్లో ,మమ్మల్ని వస్తార! అని  అడిగేరు. .నాకు వెళ్ళాలనిపించింది ,కాని వెళతాం అంటే ప్రాణాలకు తెగించి వెళ్ళటమే .అక్కడనుంచి వరుసగా  కట్ట వెంబడి ముంపుబాదితులకు, ఫుడ్ పాకెట్స్ ఇచుకుంట వేల్లేము .ఇంకా వారికీ ఏమి కావాలో అడిగేము !బట్టలు ,రైస్ కావాలన్నారు .ఈ సారి వచ్చినప్పుడు   ఇస్తామని చెప్పేము .
                                        మిగతా మండలాల్లో కట్ట పక్కన గ్రామాలూ వారిఇళ్లు పూర్తిగా కన్పించడం లేదు ,అక్కడక్కడ పెద్ద బిల్డింగ్స్ టాప్ మాత్రం కన్పిస్తున్నాయి .తోటలు అరటి ,పసుపు ,కంద ,చెరుకుఆనవాళ్ళు లేవు  .ఇంక ఏమి చెప్పాలి పూర్తి గ అన్ని కోల్పోయారు .కట్ట మీద ఉన్నవారికి చాల స్వచ్ఛంద సంస్థలు వచ్చి బ్రెడ్ ,బిస్సుత్స్ , బిర్యాని ,పులిహార ,మజ్జిగ .....ఇలా ఎన్నో మా వెనుకే చాల మంది వచ్చి ఇచ్చి వెళుతున్నారు .చాలవెస్ట్ కూడా ఇయిఉంతుంది .కాని ప్రజలు ఎగబడి తీసుకోవటం మేము కంట్రోల్ చెయ్యలేకపోయము ,వారిని అలా చూస్తుంటే చాల బాదగా అన్పించింది .చివరికి అవనిగడ్డ చేరేము , అక్కడ పునరావాసకేంద్రాలు చూసేము ,మాజీ మంత్రి  బుద్ధప్రసాద్ గారి అద్వర్యంలో చాలాబాగా చూస్తున్నారు .ఉన్న ఫుడ్ పాకెట్స్ అన్ని పంచేసేము .అక్కడనుంచి హంసలదివికి వెళ్దామని అనుకున్నాము (కృష్ణమ్మా వెళ్లి సముద్రంలో కలిసేచోటు)అక్కడకు  చాల దగ్గర ,కాని సందర్శకులను రానివ్వడంలేదని తెలిసి తిరుగు ప్రయాణం అయ్యాము .పులిగడ్డ అక్విదేట్ దగ్గర వంతేనమీద  ఆగేము .అబ్బ !ఎంత అందమయిన దృశ్యమో ,బందరు కాలువ వెళ్లి నదిని దాటుకుని వెళుతుంది ,దూరంగా ఆరెండు కలిసే చోటు కృష్ణమ్మా పరవళ్ళు,ఎంత అందంగా ఉందొ చెప్పలేము .వంతీన నుంచి కిందకి చూస్తుంటే వళ్ళు గగుర్పొడిచింది ..అక్కడనుంచి మోపిదేవి వచ్చేము ,టైం చుస్తే ఆరు దాటింది సుబ్రమణ్యస్వామి టెంపుల్ ప్రసిద్ది,టైంచుస్తేఆరుదాటింది ,అయినవేల్లల్సిందే అన్నారు .దర్సనం చేసుకున్నాక అందరికి ఆకలి గుర్తొచ్చింది .పొద్దున్నించి ఏమి తినలేదు ,కూల్డ్రింక్స్ బిస్సుత్స్ తో కడుపునింపుకుని తిరుప్రయనం అయ్యాము .మరుసటిరోజు గుంటూరు కి ఎలావెళ్ళాలో మాట్లాడుకుంటూ వచ్చేము .             
                               ప్రస్తుతం రైస్,దుప్పట్లు ,బట్టలు తీసుకుని రొండో సారి వెళ్ళే ఏర్పాటులో ఉన్నాము .             

15 comments:

cartheek said...

chaala manchipani chesaaru anaga gaaru...
we appretiate you.....

జయ said...

అనఘ గారు. చాలా మంచి పని చేసారు. మీరు ఒక సాహసమే చేసారు. ఇంక కొనసాగిస్తున్నందుకు మీకు అభినందనలు. All the best.

anagha said...

@కార్తీక్ గారు ధన్యవాదాలండి .

anagha said...

@జయగారు, ధన్యవాదాలండి .ఇష్టమైనపని కష్టమైన చెయ్యాలనిపిస్తుంది .

sreenika said...

అనఘ గారూ,
సాటి మనిషి కష్ఠాల్లో ఒక కన్నీటి చుక్క చాలు.వారికెంతో ధైర్యాన్ని ఆశని ఇస్తుంది. మీరు చాల మంచి పని చేసారు.

cartheek said...

anagha gaaru maali eppudandi mee raaka........

anagha said...

@sreenika garu,ధన్యవాదాలండి .ఈ వరదలకి ప్రజలందరు బాగా స్పందించేరు ,బాదితులకు సహాయం ఎక్కువ అందింది .

anagha said...

@కార్తీక్ గారు ,ఈ రోజు కూడా సహాయ కార్యక్రమలకి వెల్లివచ్చేను,ఆరోజు బోట్లో వెళ్ళాలన్న కోరిక ఈ రోజు తిర్చుకున్నాను .ఈ రోజుతో డిస్ట్రిబుషన్ కార్యక్రమం అయిపోయింది .

cartheek said...

ఐతె ఈ గోదావరి గలగలలు త్వరలోనె వినబొతున్నామన్నమాట

శివ చెరువు said...

mee second visit ki all the best - Siva Cheruvu

anagha said...

@శివ గారికి ,నా బ్లాగ్ విజిట్ చేసినందుకు ధన్యవాదాలు .

విశ్వ ప్రేమికుడు said...

అరె.. పై పోష్టుకు కామెంట్ ఎక్కడ చెయ్యాలి? అక్కడ కామెంట్ సెక్షన్ లేదు :(

మురళి said...

అనఘ గారూ, మీ బ్లాగు చాలా బాగుంది..అభినందనలు.. 'తోటకూర' టపా దగ్గర కామెంట్స్ ఆప్షన్ కనిపించడం లేదు.. ఒకసారి చూడండి..

anagha said...

@విశ్వగారు,చాలారోజుల తరువాత నా బ్లాగ్ కు వచ్చేరు ,ధన్యవాదాలు .సెట్టింగ్స్ అన్ని ఎప్పటిలాగానే ఉన్నాయి ,కానీ కామెంట్స్ ఆప్షన్ మాయమయింది .ఏమి చెయ్యాలో చెప్పండి .

anagha said...

@మురళి గార్కి ,ధన్యవాదాలు .కామెంట్స్ ఆప్షన్ మాయం , కామెంట్స్ సెట్టింగ్స్ లో చూసేను ,తేడ ఏమిలేదు .సలహా ఇస్తారా !