Saturday, March 27, 2010

"మా ఇంటి దాదా "

                                              నాన్న గారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉన్నాము .అప్పటికే అక్కవాళ్ళు కోత్త స్కూల్లో జాయిన్ అయ్యారు . నాకు నాలుగేళ్ళ వయసు ,అక్క వాళ్ళు చదివే స్కూల్లోనే నన్ను ఒకటవ తరగతిలో చిన్న అక్క తో
పాటు ఆమె క్లాసు లో కొత్తగా జాయిన్ చేసేరు .కొత్త అయిన నేనేమి ఏడవలేదు అక్క వాళ్ళతో చక్కగా వెళ్ళెను .స్కూల్ లో నాతోటి పిల్లలు చాలామంది ఉన్నారు ,వాళ్ళందరిని చూస్తాఅక్కతో పాటు నుంచున్నాను .ఇంతలో క్లాసు లోకి మాస్టర్ వచ్చేరు .మాస్టర్ గారికి నన్ను అప్పచెప్పి అక్క వెళ్ళిపోయింది.మాస్టర్ గారు తెల్లగా, లావుగా పంచె కట్టుకుని ,పిలక ,నుదుటన పొడవాటి తిలకం,అయన పేరు శ్రీనివాసాచారి .నన్ను ఎత్తుకుని ముద్దుపెట్టుకుని(నేను చాల బొద్దుగా ముద్దు ఉండే దాన్నంట) అయన టేబుల్ మీద కుర్చోపెట్టుకున్నారు.స్కూల్ అయిపోయాక అక్కవల్లతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను .మర్నాడు స్కూల్కి వెళ్ళాక మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టారు ,మిగతా పిల్లలందరూ బల్లల మీద కూర్చున్నారు.మాస్టర్ గారు జేబులోనుంచి పటిక బెల్లం ముక్కలు (పలకలుగా చిన్నవిగా ఉన్నాయి )నాచేతిలో పోసేరు ,నాకు బాగా నచ్చయి,తిన్నాను .


పిల్లలందరికీ బోర్డ్ మీద రాసి రాయమనేవారు .నాకయితే పలకమీద రాసిచ్చి దిద్దమనేవారు .నేను రోజు అయన టేబుల్ మీదే కుర్చునేదాన్ని ,రోజు పటికబెల్లం ముక్కలు ఇచ్చేవారు .నా స్కూల్ డేస్ మొదటి సంవత్సరం సంతోషంగా గడిచిపోయింది (ఈ మధ్య మా స్కూల్ ,అప్పట్లో మేము ఉన్న ఇల్లు అన్ని చూసి వచ్చెను .(అక్కడ రెండు ఏళ్ళ తరవాత వేల్లిపోయము ) మల్లి ఇప్పుడే చూడటము,నా సంతోషాన్ని మాటలతో చెప్పలేను .
                                         రెండో తరగతిలోకి వచ్చెను ,నన్ను అక్కని ప్రైవేటు కి పంపించేరు,నేను సైలెంట్ ,అల్లరి చేసేదాన్ని కాదు .అక్క అల్లరి చెప్పక్కరలేదు ,చాల గడుసు ,ఆటలు ,పాటలు.ఆమె ఫస్ట్ ఉండాలి .వేరే ఎవరికయినా వచ్చిందా కంటిచుపుతోనే భస్వం చేసేది . సన్నగా ,తెల్లగా ఉండేది ,స్టైల్ గ తయారవడం చాల ఇష్టం ,అమ్మ జడ వేసినాక చివర్లో నీళ్ళు తడిపి ఉంగరాలు వచ్చేలాగ తిప్పేది ,పౌడర్ టిన్నుమేము ఇల్లంతా పడేస్తామని అమ్మ పైన పెట్టేది ,మన" దాదా" గారికి అందేది కాదు,కానీ మొహానికి పౌడర్ రాసుకుని కాటుక పెట్టుకోవాలి ఏంచెయ్యాలి ?బియ్యం డబ్బా దగ్గరకు వెళ్లి చేతులు దాంట్లో పెట్టేసి ,చిన్న చేతులతో మొహమంతా పులుముకునేది .బియ్యంలో ఉన్న వైట్ డస్ట్ పేస్ మీద ,కాటుక తీసుకుని అమ్మకు తెలియకుండా ఫిష్ ఆకారంలో కళ్ళ చివరివరకు పుల్లతో దిద్దేది .
ప్రవేట్ క్లాసు  లో ఫిఫ్త్ క్లాసు వరకు ఒక గ్రూప్ గా  కుర్చోపెట్టేవారు .అందరికి క్లాసు వర్క్ ఇచ్చేవారు. టేబుల్స్ ,,తీసివేత, కూడికలు ఇచ్చేవారు . మనమందరం ఒక్కసారే మాస్టర్ దగ్గరకు వెళ్లి చుపిద్దము అని చిన్న అక్క మాతో చెప్పేది .నాది ఇంకా అవలేదు మీరంతా మెల్లిగా రాయండి అని చెప్పేది.నాది ముందు అయిపోయిన అమెది అవలేదేమో అని కుర్చునేదాన్ని ,మిగతా ఫ్రెండ్స్ అందరుకూడాస్లోవ్గా రాస్తా ఉండేవాళ్ళు .ఈలోపుచిన్నక్క వెళ్లి మాస్టర్ కి చుపించేసేది ,అందరికన్నా ముందు రాసినందుకు ఆమెని మెచ్చుకుని ,ఇంకా రాయనందుకు మిగతావారిని తిట్టేఅలా ఎందుకు చేసేవు అని అడిగే దైర్యం ఎవరికి ఉండేది కాదు ,ఒకవేళ ఎవరయినా అడిగితె వాళ్ళ పని అయిపోయేది .చిల్డ్రన్స్ డే కి ఆటల పోటీలు పెడితే ,నాకన్నా ముందు పరిగెత్తవద్దు అని సైగ చేసేది నేను నా ఫ్రెండ్స్ మణిమాల ,లక్ష్మి సరే అని తల ఉపే వాళ్ళం.నాకు ప్రైజ్ తీసుకోవాలని  కోరిక ఉండేది ,కానీ ఏమి చేయలేకఎదాన్ని  .తన ఫ్రెండ్స్ కి కూడా కళ్ళతో వార్నింగ్ ఇచ్చేది .అనిట్లో ఆమె ఫస్ట్ తనకే ప్రైజెస్. ఇంతచేసిన ఫ్రెండ్స్ అందరు ఆమె వెనుకే తిరిగేవాళ్ళు .

 ఇంటి లో కూడా ఆమె చెప్పినట్లే చెయ్యాలి ,లేకపోతె అందరితో పోట్లడేసేది.అమ్మ ,నాన్న లు ముద్దుగా "బెడగుండా రాక్షసి" అనిపిలిచేవాళ్ళకారెంబోర్డ్ ఆటలో ఆమెఓడిపోతుందిఅంటే , అన్ని కలిపేసి వెళ్లి పోయేది .ఓటమి అంగీకరించదు .నా రెండవ తరగతి అల గడిచింది ,కానీ ఇప్పుడు అవి అన్ని తీపి గుర్తులు.

                            పెద్దయ్యాక దాదాగిరి మానేసింది మా పండక్క.లీడర్ క్వాలిటీస్ మాత్రం ఉన్నాయి ,కాలేజీ లో కూడా పదిమంది ఫ్రెండ్స్ వెనక ఉండేవాళ్ళు , లేక్త్చురర్స్ ,స్నేహితులు బాగా ఇష్టపడేవారు .తెలివితేటలూ ఎక్కువని అందరు మెచ్చుకునేవాళ్ళు .


అప్పటిరోజులు తలుచుకుని నవ్వుకుంట వుంటాము .ఇప్పుడు తను బాగా చదువుకుని మంచి జాబ్లో ఉంది.

Sunday, February 14, 2010

ప్రేమ ........

                                                          ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో ......
                       
                                     ప్రేమనేది లేకుండా మనిషి బ్రతకలేడు.తల్లిదండ్రులుగాని  ,తోబుట్టువులుగాని  మనల్ని ప్రేమతో చూడాలని కోరుకుంటాము .కుటుంబములోసరైన  ప్రేమదొరకపోత ,ఎవరైనా బయటవారు అప్యాంగా మాట్లాడితే చాలు  త్వరగా ప్రేమలో పడిపోతారు .
                                       ఈ రోజుల్లో ప్రేమికులు దౌర్జన్యంగ వ్యవహరిస్తున్నారు ,ఒకమ్మయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కూడా ఇష్ట పడాల్సిందే,లేకపోతె హతమారుస్తున్నారు .అది నిజంగా ప్రేమేనా ?అది అసూయా ,నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు ,ఉన్మాదులుగా తయారు అవుతున్నారు.
                             ఇంతాచేసి ,పోనీ ఒప్పుకుని పెళ్ళిచేసుకుంటే ,కలకాలం సంతోషంగా జీవిస్తున్నార ?ఈ రోజు పెళ్లి ,సంవస్త్సరం లోపే పెటాకులు .పెద్దలు కూడా వంత పాడుతున్నారు .ఇంకా వాళ్ళకు పుట్టిన పాపానికి బాదితులు వారి పిల్లలు                     
                   నాదృష్టిలో నిజమైన ప్రేమికులు ,చివరిదాకా సంతోషంగా కలసి జీవించినవాళ్ళు.షాజహాన్ ,ముంతాజ్ నిజంగా అద్బుతమైన ప్రేమికులు .పద్నాలుగు మంది పిల్లలు పుట్టిన తరువాత ఆవిడ చనిపోయింది, అప్పటికి వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు .ఆవిడా చనిపోయిన తరువాత తొమ్మిదిరోజులు గది తలుపులు తీయకుండా పచ్చి మంచినీరు కూడా తాగ లేదంట .ఆవిడా ఎంత ప్రేమ అందించకపోతే, షాజహాన్ చివరిరోజుల్లోకుడా తాజ్ మహల్ చూస్తూనే ప్రాణం వదిలేడు.

                           భాగమతి, కులికుతుబ్ ల ప్రేమ కూడా అద్భుతం, నిజమైన ప్రేమికులంటే వీరే .ప్రేమికులందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని చివరివరకు కలిసి  జీవిస్తే బాగుంటుంది .
                            నాకైతే , ఏ జంట విడిపోయిన బాధవేస్తుంది ,జంటలు విడిపోయే సినిమాలను చూడను ,కథలైతే చదవను .
                                

Friday, February 12, 2010

దేవుడున్నాడు !

                                        శివరాత్రి శుభాకాంక్షలతో ....

          
                                        ఆరు ఏళ్ళ క్రితం ,ఒక ఆదివారం ఇంట్లో పని అయిన తరువాత  పన్నెండుగంటలకు కూర్చుని   పుస్తకం చదువుతున్నాను.
                                  
                                            చుట్టూ శూన్యం ఎక్కడ ఉన్నానో అర్ధమవలేదు.అంతట చీకటి అక్కడక్కడ మినుకుమినుక మంటూ చుక్కలు ,చుట్టూ చూస్తే ఎవ్వరు లేరు , అమ్మో! ఎక్కడకు వచ్చెను ?ఎవ్వరు లేరు ,తెలియని చోటికి వచ్చెను  వెళ్లిపోవాలి అని ప్రయత్నిస్తున్న,కానీ వెళ్ళాలని చూస్తే గాల్లో తేలుతున్నాను .భయంతో  చెమటలు పట్టాయి ఇంటిలో అందరిని పేరు పేరు నా  పిలుస్తున్న ఎవ్వరు పలకడం లేదు .పై పైకి వెళ్ళిపోతున్న ,చాల సేపు ప్రయాణం తరువాత తెల్లటి ప్రదేశానికి వచ్చెను .చుట్టూ చల్లగాలి ,అంత మంచు, నడుస్తున్నాను .ఎటునుంచి ఇంటికి వెల్లాల అనే ఆలోచనే !కొంతదూరం నడిచేను ,అంతే! ఎదురుగ శివ పార్వతులు నావైపే చూస్తున్నారు ,నాలో ఆనందం ,భయం ."దయచేసి నన్ను పంపించెయ్యండి ,నాకు అమ్మాయి ఉంది నాకోసం ఎదురు చూస్తా ఉంటది"అటు వైపునుంచి ఉలుకు లేదు పలుకులేదు .వాళ్ళ కాళ్ళ దగ్గకుర్చుని ఒకటే బతిమలుతున్న ,వారు మాత్రం ఏమి మాట్లాడకుండా ప్రసాంతంగా నావైపు చూస్తున్నారు .నాకళ్లలో నీళు,ఇంకా అక్కడనుంచి లేచి వారి చుట్టూ తిరిగి దారి కనపడద్దేమో అని వెతికేను ,ప్చ్ !నిరాశే ఏడుస్తూ మళ్ళి వారి దగ్గరకు వచ్చెను ,నా ప్రాణమంత మా అమ్మయి చుట్టూ ఉంది .మళ్ళి పంపించేయ్యమని బ్రతిమలేను .కొంతసేపటికి మళ్ళి నేను చీకటిలో , సూన్యంలో ఉన్నాను ,గాల్లో ప్రయాణం.


                    ఉలిక్కి పడి చుట్టుచుసేను పుస్తకంనా చేతుల్లోనే ఉంది . టైం చుస్తే ఒంటిగంట దాటింది ,ఒక్కసారే గుండె లబడబ్ చప్పుడు నాకే విన్పించింది టెన్షన్ తో వళ్ళంతా చమటలు పట్టాయి .హమ్మయ్య ! ఇంటిలోనే ఉన్నానా ?అంతా గుర్తు వచ్చింది ఒక్కసారే వళ్ళుజలతరించింది . ఇంటిలో అందరితో చెప్పెను, అచ్చర్య పోయారు.శివపార్వతులు ఎందుకు కన్పించారో నాకు అర్ధమవలేదు !కనీసం నేను తలుచుకోవడం కూద చెసెదన్ని కాదు, నిజంగా శివపార్వతులు మంచుకొండల్లోనే ఉంటారా!చాల కాలం వరకు ఆ దృశ్యాన్ని మర్చిపోలేకపోయా .అప్పటినుంచి ఏదో ఒక సంఘటనలు జరుగుతుండేవి .
 
                                                    * * * *


మా ఇంటిలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి నే పుజిస్తారు .చిన్నప్పుడు ఎక్కువగా తిరుపతి తీసుకు వెళ్ళేవారు ,శివాలయాలకు తక్కువుగా తీసుకు వెళ్ళేవాళ్ళు.శివరాత్రి అప్పుడు మాత్రం తీసుకువెళ్ళేవారు . అందుకేనేమో పెద్దయ్యాక దేవుడంటే వెంకటేశ్వరస్వామి ,షిర్డీ సాయి బాబా నే ఎక్కువగా పూజ చేసేదాన్ని.అందరిలాగే నాకు పెద్ద డైలమ ,అసలు నిజంగా దేముడున్నాడా!ఎప్పుడు నాలో సంఘర్షణ,పైన సంఘటనతో నాకు దేముడున్నాడు అని నమ్మకమేర్పడింది .అప్పటినుంచి శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళటం ,ఏ కష్టమొచ్చిన ఓం నమః శివాయ అనుకోకుండా ఉండలేను .ఏ వూరు వెళ్ళిన శివాలయం వుంటే దర్శించుకుంట .శివుడు నాకు ఇష్ట దైవం అయ్యాడు.ఈ సంవత్స్తరం శివరాత్రి రోజే మా పెళ్లి రోజు కూడా అవడం చాల ఆనందగా వుంది .
                        
          మాములుగా అయితే  ఒక్క పూట కూడా తినకుండా  ఉండలేను .కాని కార్తీకమాసం ,శివరాత్రి కయితే  ఉపవాసము ఉండగలను .ఇదంతా మన సంకల్పబలమేమో !

Thursday, October 29, 2009

తోట కూర కథ



               నేను నా పనులతో బిజీగ ఉన్నాను.అమ్మ దగ్గరనుంచి ఫోన్ 'నేను చెప్పిన విషయం కనుక్కున్నావా ?'అని అమ్మ అడిగింది .'అయ్యో! కనుక్కోలేదు ,ఇప్పుడే కనుక్కుంటాను' అని చెప్పెను .మూడు రోజుల్లో అమ్మ  పుట్టినరోజు వస్తుంది ,ఆరోజు వృద్ద ఆశ్రమంలో భోజనాలు పెట్టించాలి అని .నాన్నగారు ,అమ్మ వారి పుట్టిన రోజున అల పెట్టించడం అలవాటు .నా పనులు పక్కన పెట్టి బుక్ చెయ్యడానికి  వెళ్ళాను.నెల ఆఖరువరకు అన్ని డేట్స్ బుక్ అయిపోయంట.వేరే ఓల్డ్ ఏజ్  హొమ్స్ కి ఫోన్ చేశా ,అక్కడ బుక్ అయిపోయంట .నెక్స్ట్ మంత్ అయితే ఇస్తామన్నారు(మనకి కావాల్సింది అక్టోబర్         పద్దెనిమిది)ముందేవెళ్లివుంటే బాగుండు  అనుకున్న,నాకేంతెలుసు  దాతలు ఎక్కువైపోయారని.ఒకవైపున మనుషుల్లో స్వార్ధం ఎక్కువైంది అనుకుంటున్నాము  కానీ  మానవత్వం కూడా పెరిగిందన్నమాట (మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ఎందుకు పెరుగుతున్నాయి?)

                                     అమ్మని నిరాసపరచడం  ఇష్టంలేక అన్ని చోట్ల కనుక్కున్న ,పోనీ అబ్సేర్వషన్ హోం లోఇస్తే! కనుక్కుందాం అనుకున్న,ఫోన్ చేస్తే వాళ్ళు ఓకే  అన్నారు . అమ్మకూడా ఒప్పుకుంది.


                                  పద్దెనిమిది సంవస్తసరాల వయసు లోపు పిల్లలు నేరం చేస్తే ఈ హోం లో ఉంచుతారు .వారిని కొట్టకుండా, తిట్టకుండా,బేడీలు వేయకుండా పోలీసులు సివిల్ డ్రెస్ లో హోమేకి తీసుకు వస్తారు .పోలీసులు కొట్టారని తెలిస్తే వారిమీద ఎక్షన్ తీసుకోవడం జరుగుతుంది .ప్రతి వారం ఒక రోజు అక్కడే కోర్ట్ నిర్వహిస్తారు .జడ్జి ,సైకాలజిస్ట్ ,సోషియలజిస్ట్,ఒక బెంచ్ గ కుర్చుని కేసు ని పరిశిలిస్తారు,బెయిల్ ఇస్తారు ,కేసు బట్టి కొంతమందికి బెయిల్ రాదు .నేరం రుజువైతే వారిని వైజాగ్ ,తిరుపతి ,హైదరాబాద్లో ఉన్న స్పెషల్ హోం కి పంపిస్తారు .అక్కడ వారికీ చదువు ఒకేషనల్ ట్రైనింగ్స్ఇస్తారు .కౌన్సిలింగ్ ద్వార వారిలో మార్పు తీసుకు రావడనికి ప్రయత్నిస్తారు . ఆరోజే నేను వెళ్లి ఎంతమంది ఉన్నారో చూసి వారికీ ఏమి స్పెషల్ కావాలో అడిగి తెలుసుకిని ఆర్డర్ చేసి వచ్చెను .                                                                                     
             అమ్మపుట్టినరోజునా ,మాకు అమ్మచేసినలడ్డులు ,సున్నుండలు ,గారెలు,సేమ్యా ,పంపించింది మా సిస్టర్స్, బ్రదర్స్ వేరే ప్లేసెస్లో ఉన్నారు .నేను మాత్రం అమ్మవాళ్ళ కి దగ్గరలోనే,వాళ్ళ కాలనీలోనే ఉంటున్నాము .మా అత్తా గారువాళ్ళు ఆ కాలనీలోనే ఉంటారు .ఎవరికి ఏ అవసరం వచ్చిన వెంటనే నాకు ఫోన్ వస్తుంది .వాళ్లపనులు చూసేక న పనుల్లోకి వెళతాను .

                     అమ్మని తీసుకుని అబ్సేర్వషన్  హోం కి వెళ్ళెను .అది  రెం డు అంతస్తుల ఇండిపెండెంట్ హౌస్ ,గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీసు ,స్టాఫ్ ఉంటారు .పైన పిల్లలు ,బయటకు వెళ్ళకుండా అంత సెక్యూరిటీ ఉంటుంది .పిల్లలందరూ యునిఫోం లో ఉన్నారు .మాకోసం ఎదురు చూస్తున్నారు.ప్రోబెస్షనరీ ఆఫీసర్ వచ్చి విష్ చేసి ఆహ్వానించేరు .పిల్లలందరూ వచ్చి వరుసగా కూర్చున్నారు.మమ్మల్నిపరిచయంచేసేరు,దాదాపుపాతికమందిదాకఉన్నారు .అందరు ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు ,వాళ్ళందరిని పరిచయం చేసుకోమంటే సిగ్గ్గుపడుతూ తలవంచుకున్నారు దగ్గరకు పిలిచి భుజం చుట్టూ చేతులు వేసి హోం లో ఎలా చూస్తున్నారు ,ప్రోబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను ,దానితో  వాళ్ళు ఫ్రీ అయిపోయి అన్ని కబుర్లుచెప్పేరు ,అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నరు .నలుగురు మాత్రం అనాధలు ,మిగతా వారికీ తల్లి దండ్రులు ఉన్నారు .ఇంటిలో సరిగ్గా చదవట్లేదని తిడితే కోపమొచ్చి వచ్చేసినవాళ్ళు ,తండ్రి బాగా తాగి ,కొట్టి ఇంటిలో గొడవ చేస్తుంటే ఉండలేక వచ్చేసిన వాళ్ళు ,చెడు స్నేహితుల వల్ల వచ్చేసినవాళ్ళు కొందరు ,చిన్నప్పుడే పనిలో పెడితే ఇష్టం లేకే పారిపోయి వచ్చినవాళ్లు .వీళ్ళందరూ గాంగ్ చేతుల్లోపడిదొంగతనాలు చెయ్యడం,సొంతంగా డబ్బు అవసరమొచ్చి కొంతమంది , డ్రగ్స్ కోసం కొంతమంది  ,వీళ్లు ఎక్కువగా తీసుకునే డ్రగ్స్, వైట్నర్ సోలుషన్ ,ఖైని ,ఇంకా ఏవో పేర్లు చెప్పేరు.వాళ్ళ  పేరెంట్స్ గురించి చెప్పుత చాలమంది ఏడ్చేరు .నేను వాళ్ళందరికీ గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చెను. అందరిలో చిన్నవాడు సందీప్ ,వయసు పన్నెండు  ,చిలకలూరిపేట .దగ్గరకు పెలిచాను ,ఫ్రెండ్లీగా మాట్లాడ ,అతని పైన ఇదు కేసులు ఉన్నాయంట .'ఎందుకు దొంగతనం  చేసేవు '?అని అడిగితె !'పక్కింటి అన్న సినిమాకి తీసుకువెళతాను అని చెప్పి వేరే  వూరు తీసుకు వెళ్లి దొంగతనం చేయిన్చేడు'అని చెప్పేడు  .ఇంటికి వెళ్లి పోతాను పంపించెయ్యండి అనిఎద్చేడు.చాలచక్కగాఉన్నాడు ,వాడినిచుస్తేజాలి    వేసింది .వాడిని చూసి అమ్మ బాధపడింది .'తల్లి దండ్రుల పెంపక లోపం వలెనే వీరి బంగారు భవిష్యత్ నాసనమయ్యింది .పసి మొగ్గలు ,లేత మొక్క ఎటు వంచితే అటు వంగుతుంది ,ఇప్పటికయినా వీరిలో మార్పు వస్తే బాగుండు అంది' పిల్లల కు తోట కూర కథ చెప్పింది.ఇది అందరికి తెలిసిన కధే,స్కూల్లోమోరల్  సైన్స్ క్లాస్లో కూడా చెప్పేవారు . .అమ్మ మా చిన్నపుడు ఈ కధ చాలాసార్లు చెప్పింది ,రాత్రి పూట భోజనాలు చేసేటప్పుడు,ఇలాంటినీతికథలు,,మర్యదలగురించిఅన్నిచెప్పేది ,ఇప్పటికి ఆ కధలన్నిగుర్తున్నాయి .                                      ఒకపిల్లవాడు ,వాళ్ల ఇంటికి వచ్చిన కూరగాయల అమ్మి దగ్గరనుంచి తెలియకుండా తోటకూర దొంగ తనం చేసేడు.కురగాయలామ్మి వెళ్ళిన తరువాత ,వాళ్ల అమ్మకు చూపించేడు '.అరె!మేము అక్కడే ఉన్నము ఎలా తీసేవు ?'అని అతని చాకచక్యాన్నిమెచ్చుకుంది .అప్పట్నుంచి చిన్న దొంగ తనలు చేస్తా ,పెద్ద గజ దొంగ అయ్యేడు .యావజ్జీవ శిక్ష పడితే ,జైలు కి వెళ్లి తల్లి బోరున ఎడ్చిన్దంట.అప్పుడు కొడుకు 'ఎందుకు ఏడుస్తావమ్మ! ,నేను తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు మందలిస్తే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు'అన్నాడు. 'చూసేరా !సరదాగా చేసిన చిన్న దొంగతనము వాడి జీవితం ఎలా నాసనమయ్యిందో ,మీరు ఇంకా చాల చిన్నోళ్ళు ఇప్పటికయినా మీరు మారితే మీ జీవితాలు బాగుంటాయి' అని కథ ముగించింది . పిల్లలందరూ శ్రద్దగా విన్నారు .బయటకు వెళ్ళినాక మేము మంచి గ ఉంటామని మాట ఇచ్చేరు .అప్పుడప్పుడు వస్తా ఉండమని అడిగేరు ,మీరు మారతను అంటే తప్పకుండ వస్తాను అని చెప్పెను . తరువాత వారందరికి భోజనాలు వడ్డిచ్చేరు.స్పెషల్ భోజనం స్వీట్స్ ,చికెన్ బిర్యాని ,ఫ్రూట్స్ .వాళ్ళందరి కళ్ళలో కృతజ్ఞత ,ఆనందం .వారిదగ్గరసెలవు తీసుకుని   వచ్చేసేము.                                                                                                                        

Sunday, October 11, 2009

వరద ముంపు గ్రామాల్లో మా పర్యటన

                        రాష్ట్రమంతా వరదల గురించే చర్చ ,గంటల వ్యవదిలో కర్నూలు ,మహబూబ్ నగర్ జిల్లాలు మునిగిపోవటం ,ప్రజలందరు నిరశ్రేయులవటం ,కట్టలు  తెగిపోవటం .చాలబాదవేసింది ఛానల్స్ పోటీపడి ఆ దృశ్యాలని చూపిస్తున్నాయి .భాదితులతోపాటు  మీడియా వాళ్ళు కూడా పీకల లోతులో దిగి లైవ్ ప్రోగ్రాం చూపించటం .చూస్తకి క్రిష్నమ్మ ఉగ్రరూపం చాల భయంకరంగా  ,ఇంకోవైపు డమ్స్ నుంచి వచ్చే నీరు అందంగా పరవళ్ళు తొక్కుతూ (చూడటానికి రెండు కళ్ళు చాలవు ) .క్షణం క్షణం ఉత్కంఠ ,భయం,టెన్షన్ .వరదలు ఇప్పుడు గుంటూరు ,కృష్ణ జిల్లాలని ముంచెయ్యపోతున్నాయి, ప్రాణాలను రక్షించుకోందని చానల్స్ ,అధికారుల హెచ్చరికలు . టి. వి చూడకూడదు అనుకుంటూనే చూడటం .ఇలాకాదు డైరెక్ట్ గ వెళ్లి  పరిస్థితి చూడాలి అనుకున్నాను .
                                 మర్నాడు (అక్టోబర్ నాలుగు ) మా ఫ్రెండ్స్ బృందం ఎనిమిదిమంది ,అందరికి సోషల్ సర్వీసు అంటే ఇష్టం .గుంటూరు ,కృష్ణ జిల్లాలలో పర్యటించాలని అనుకున్నాము .ముందుగ కృష్ణకి వెళ్ళాలని ,ఇదు వేల పులిహార,పెర్గుఅన్నం పాకెట్స్ ,వాటర్ పాకెట్స్,   పెద్ద వేహికాల్స్ లో బయలు దేరేము . ప్రకాశం బరేజ్ అప్పటికి సందర్సకులని రానివ్వటంలేదు ,బరేజ్కి ఇవతల నుంచి చూసేము .కృష్ణమ్మా ఉగ్ర రూపం చాల భయంకరంగా   ఉంది .అక్కడ్నుంచి కరకట్ట ప్రాంతాలకి వచేము .దాదాపు ఇళ్ళని మునిగిపోయి అంత నదిలగా కనిపిస్తుంది.సగంమంది పునరావాస కేంద్రాలకి వెళ్ళేరు .సగంమంది కట్టమేదే వున్నారు 'ఎందుకు వెళ్ళలేదని 'అడిగితె,ఇంటిలో సామాను దొంగలు తిసుకుపోతరేమోనని వెల్లడము లేదని చెప్పేరు .కృష్ణమ్మా, దాదాపు కరకట్టని ఆనుకుని ప్రవహిస్తుంది .రాత్రికి పూర్తిగా మునిగిపోతుంది అనే భయం తో ఉన్నారు .పోలీసు సిబ్బంది యవ్వరిని దగరకు  వేల్లనివ్వటం లేదు .కొన్నిపెకేత్స్ వారికీ ఇచ్చి ,రామలింగేస్వర్ నగర్ బాగా మునిగిపోయిందంతా ,అక్కడికి బయలుదేరేము .దారిలోపునరవాసు కేంద్రాలని చూసేము ,వారికీ చాల మంచి ఆహరం ఇస్తున్నారు ,అన్ని సదుపాయాలు కలిగిస్తున్నారు .
                                            బాగా ముంపుకు గురయిన లంకగ్రమల వైపు బయలు దేరేము.తొట్లవల్లూరు,ఘంటసాల,మోపిదేవి, చల్లప ,అవనిగడమండలాలలోని గ్రామాలన్నీ  మునిగాయంత, ముందుగ తొట్లవల్లూరు వేల్లేము,ప్రజప్రతినిదులు చాలమంది ఉన్నారు.నది ఒక సముద్రాన్ని తలపిస్తుంది ,ప్రవాహం ఉదృతంగా ఉంది .నీళ్ళు కట్టమీదకి  వచాయి మేము నిలబడితే మాకాళ్లని    తాకు తున్నాయి .కనుచూపుమేర లంక గ్రామాలూ కనిపించడం లేదు .అక్కడి ప్రజలు  సగంమంది గ్రామంలోనే ఉన్నారంట .వాళ్ళకి ప్రానలకన్నవారి ఆస్తులే ముఖ్యం అనిపించింది .మీడియావారు, పోలీసు సిబ్బంది దుమ్ముకోట్టుకుని చింపిరిజుట్టులుతో ఉన్నారు .రాత్రి,పగలు కూడా అక్కడే ఉంటున్నరంట్ట .పొదున్నించి టిఫ్ఫెన్ కూడా తినలేదు అన్నరు ,అప్పటికి పదకొండు దాటింది మా దగ్గర ఉన్న ఫుడ్ పాకెట్స్ ఇచ్చేము .లంక గ్రామలవారి కోసం సిబ్బందే భోజనం తిసుకువేలుతున్నారు,వారితోపాటు మీడియావారు అంతప్రవాహంలో చిన్న బోట్లో ,మమ్మల్ని వస్తార! అని  అడిగేరు. .నాకు వెళ్ళాలనిపించింది ,కాని వెళతాం అంటే ప్రాణాలకు తెగించి వెళ్ళటమే .అక్కడనుంచి వరుసగా  కట్ట వెంబడి ముంపుబాదితులకు, ఫుడ్ పాకెట్స్ ఇచుకుంట వేల్లేము .ఇంకా వారికీ ఏమి కావాలో అడిగేము !బట్టలు ,రైస్ కావాలన్నారు .ఈ సారి వచ్చినప్పుడు   ఇస్తామని చెప్పేము .
                                        మిగతా మండలాల్లో కట్ట పక్కన గ్రామాలూ వారిఇళ్లు పూర్తిగా కన్పించడం లేదు ,అక్కడక్కడ పెద్ద బిల్డింగ్స్ టాప్ మాత్రం కన్పిస్తున్నాయి .తోటలు అరటి ,పసుపు ,కంద ,చెరుకుఆనవాళ్ళు లేవు  .ఇంక ఏమి చెప్పాలి పూర్తి గ అన్ని కోల్పోయారు .కట్ట మీద ఉన్నవారికి చాల స్వచ్ఛంద సంస్థలు వచ్చి బ్రెడ్ ,బిస్సుత్స్ , బిర్యాని ,పులిహార ,మజ్జిగ .....ఇలా ఎన్నో మా వెనుకే చాల మంది వచ్చి ఇచ్చి వెళుతున్నారు .చాలవెస్ట్ కూడా ఇయిఉంతుంది .కాని ప్రజలు ఎగబడి తీసుకోవటం మేము కంట్రోల్ చెయ్యలేకపోయము ,వారిని అలా చూస్తుంటే చాల బాదగా అన్పించింది .చివరికి అవనిగడ్డ చేరేము , అక్కడ పునరావాసకేంద్రాలు చూసేము ,మాజీ మంత్రి  బుద్ధప్రసాద్ గారి అద్వర్యంలో చాలాబాగా చూస్తున్నారు .ఉన్న ఫుడ్ పాకెట్స్ అన్ని పంచేసేము .అక్కడనుంచి హంసలదివికి వెళ్దామని అనుకున్నాము (కృష్ణమ్మా వెళ్లి సముద్రంలో కలిసేచోటు)అక్కడకు  చాల దగ్గర ,కాని సందర్శకులను రానివ్వడంలేదని తెలిసి తిరుగు ప్రయాణం అయ్యాము .పులిగడ్డ అక్విదేట్ దగ్గర వంతేనమీద  ఆగేము .అబ్బ !ఎంత అందమయిన దృశ్యమో ,బందరు కాలువ వెళ్లి నదిని దాటుకుని వెళుతుంది ,దూరంగా ఆరెండు కలిసే చోటు కృష్ణమ్మా పరవళ్ళు,ఎంత అందంగా ఉందొ చెప్పలేము .వంతీన నుంచి కిందకి చూస్తుంటే వళ్ళు గగుర్పొడిచింది ..అక్కడనుంచి మోపిదేవి వచ్చేము ,టైం చుస్తే ఆరు దాటింది సుబ్రమణ్యస్వామి టెంపుల్ ప్రసిద్ది,టైంచుస్తేఆరుదాటింది ,అయినవేల్లల్సిందే అన్నారు .దర్సనం చేసుకున్నాక అందరికి ఆకలి గుర్తొచ్చింది .పొద్దున్నించి ఏమి తినలేదు ,కూల్డ్రింక్స్ బిస్సుత్స్ తో కడుపునింపుకుని తిరుప్రయనం అయ్యాము .మరుసటిరోజు గుంటూరు కి ఎలావెళ్ళాలో మాట్లాడుకుంటూ వచ్చేము .             
                               ప్రస్తుతం రైస్,దుప్పట్లు ,బట్టలు తీసుకుని రొండో సారి వెళ్ళే ఏర్పాటులో ఉన్నాము .             

Thursday, September 24, 2009

snehitudu

 అది నేను ముడో తరగతి చదివేరోజులు. ఖమ్మం జిల్లాలో ఉండేవాళ్ళం. భద్రాచలానికి దగ్గరే అడవి ప్రాంతంలగుండేది .రొండు ఇళ్ళు కలిపి జంటగా ఉండేవి ,మళ్ళికొంచందూరంలోరొండో ఇల్లు ,ప్రహరీబదులు ,రేగు, జామ ,సీతాఫలం  చెట్లు ఉండేవి .ఎలా వచ్చేవో ,మా పెరట్లోకి నెమళ్ళు ,లేళ్ళు వస్తుండేవి .ఇంటి ముందు పెద్ద మైదానంలా కాళి స్థలం ఉండేది .నాన్నగారి బదిలీవలన అన్ని వూర్లు తిరగాల్సి వచ్చేది . ఊరు మాత్రం నాకు చాలానచ్చింది .కొత్తగా స్కూల్ లో జాయిన్ అయ్యాను,నా తో పాటు పెద్ద తమ్ముడిని (బాబోయ్ !వాడు మహా పెంకి వాడు లెండి)స్కూల్లో జాయిన్ చేసేరు .వాడేమో అమ్మకి ముద్దుల కొడుకు స్కూల్కి వెళ్లనని రోజు పేచి ....రిక్షాలోంచి దూకేసి పరుగు పెట్టేవాడు .రిక్షావాడు తమ్ముడు వెనకాల పరుగు,తమ్ముడు తనకు వచ్చిన భాష లో అతన్ని తిట్టటం ,కొట్టడం ,ఎలాగోలా స్కూల్కి తీసుకెళ్లడం లేట్ అవటంతో నన్ను బెంచి మీద నిలబెట్టేవారు .అలా చాలసార్లునిలబడాల్సివచ్చేది. నా చదువు సంగతి దేవుడెరుగు వాణ్ని అదుపు చెయ్యటానికే సమయం గడిచిపోయేది....ఇలా వాడి తో నా పాట్లు చాలానే ఉన్నాయ్లెండి.





ఊరికొచ్చిన కొద్దిపాటి రోజులలోనే ఇళ్ళ పక్కపిల్లలందరం  పెద్ద గ్యాంగ్ గా తయారయ్యాం .కాని వారందిరిలో పక్కింటి బాబ్జీ ..కుడి పక్కింటిలో సాగర్ తో ఎక్కువ ఆడుకునేదాన్ని.అందరం కలిసామంటే ఇంక మా అల్లరికి , ఆటలకి కొదవే లేదు .ఎన్నాటలో ......దాగుడు మూతలు ,కలర్ కలర్,నేలా బందా ,మా తా ఉత్తరం ,...........ఇలా ఎన్నో.ఎప్పుడైనా వర్షం కురిసి వెరిసిందంటే చాలు మా గ్యాంగ్ అంటా మైదానంలో కి చేరి ..... మట్టి లో ఎన్నో బొమ్మలు గీసేవాళ్ళం .అందరికంటే సాగర్ అద్భుతంగా గీసేవాడు.వాడు బాగా గీస్తాడన్న్న అసూయతో సాగర్ చెల్లి శాంతి దాన్ని తుడిపేసేది.దానితో కోపం వచ్చి సాగర్ శాంతి ని బాగా తిట్టాడు.అది ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది .మర్నాడు సాగర్ చొక్కా లేకుండా తిరగడం గమనించా . ఏమి అయ్యిందా ఆరా తీస్తే .........శాంతి వెళ్లి వాలన్నయ్య మీద చాడీలు చెప్పింది,దాని పర్యవసానం తెల్లటి వీపు   మీద ఎర్రటి ,వెడల్పాటి వాతలు,దానిమీద రాసిన ఆయింట్మెంట్ .సాగర్ వాళ్ళ  నాన్నగారు శాంతి ఏమిచెప్పినా నమ్మేసి ఇలా కొడతాడంట .నాకు మా ఫ్రెండ్స్ అందరికి చాల బాద వేసింది ,అందులో మా ఆటలకు బ్రేక్ ,అప్పటినుంచి శాంతి అంటే మాకు కోపం .అప్పుడప్పుడు సాగర్ మాకు అలాగే దర్సనం ఇస్తుండేవాడు .వాళ్ల నాన్నగారు పెద్ద ఆఫీసర్ , చూస్తాకి మంచివారి లాగా   వుండేవారు .మేమందరం వాళ్ల ఇంటికి వెళ్లి నప్పుడు వాళ్ల అమ్మ మమ్మల్ని పలకరించి తినడానికి స్వీట్స్ ఇస్తుండేవారు .సాగర్ అల్లరిచేసేవాడు కాదు,బాగా చదేవేవాడు .బాబ్జికి ,నాకు సాగర్ మీద జాలి ఉండేది.నెక్స్ట్ ఇయర్ బదిలిమీద వేరేఉరు వేల్లిపోయము .ఇప్పటికి ఆరోజులు గుర్తుకు వస్తుంటాయి ,ఎవరయినా వాళ్ల పిల్లలని కొడుతుంటే చాల కోపమువస్తుంది ,బాదవేస్తుంది వెళ్లి అడ్డుకుంటాను .




చాల మంది భార్యమీద కోపాన్ని ,భర్త మీద కోపాన్నిపిల్లలమీద చూపిస్తారు .మా పెద్దమ్మగారి అబ్బాయి (అన్నా)వాళ్ల ఆవిడా మీద కోపం వస్తే భయంకరంగా పిల్లలని కొట్టేవాడు ,వాళ్ల పిల్లలయినంత మాత్రాన కొట్టటానికి ఎవరికి హక్కు లేదు .అల్లాంటి వాళ్ళను దేముడే మార్చాలేమో !