Saturday, March 27, 2010

"మా ఇంటి దాదా "

                                              నాన్న గారి ఉద్యోగ రీత్యా హైదరాబాద్లో ఉన్నాము .అప్పటికే అక్కవాళ్ళు కోత్త స్కూల్లో జాయిన్ అయ్యారు . నాకు నాలుగేళ్ళ వయసు ,అక్క వాళ్ళు చదివే స్కూల్లోనే నన్ను ఒకటవ తరగతిలో చిన్న అక్క తో
పాటు ఆమె క్లాసు లో కొత్తగా జాయిన్ చేసేరు .కొత్త అయిన నేనేమి ఏడవలేదు అక్క వాళ్ళతో చక్కగా వెళ్ళెను .స్కూల్ లో నాతోటి పిల్లలు చాలామంది ఉన్నారు ,వాళ్ళందరిని చూస్తాఅక్కతో పాటు నుంచున్నాను .ఇంతలో క్లాసు లోకి మాస్టర్ వచ్చేరు .మాస్టర్ గారికి నన్ను అప్పచెప్పి అక్క వెళ్ళిపోయింది.మాస్టర్ గారు తెల్లగా, లావుగా పంచె కట్టుకుని ,పిలక ,నుదుటన పొడవాటి తిలకం,అయన పేరు శ్రీనివాసాచారి .నన్ను ఎత్తుకుని ముద్దుపెట్టుకుని(నేను చాల బొద్దుగా ముద్దు ఉండే దాన్నంట) అయన టేబుల్ మీద కుర్చోపెట్టుకున్నారు.స్కూల్ అయిపోయాక అక్కవల్లతో కలిసి ఇంటికి వెళ్ళిపోయాను .మర్నాడు స్కూల్కి వెళ్ళాక మాస్టర్ గారు నన్ను టేబుల్ మీద కూర్చోబెట్టారు ,మిగతా పిల్లలందరూ బల్లల మీద కూర్చున్నారు.మాస్టర్ గారు జేబులోనుంచి పటిక బెల్లం ముక్కలు (పలకలుగా చిన్నవిగా ఉన్నాయి )నాచేతిలో పోసేరు ,నాకు బాగా నచ్చయి,తిన్నాను .


పిల్లలందరికీ బోర్డ్ మీద రాసి రాయమనేవారు .నాకయితే పలకమీద రాసిచ్చి దిద్దమనేవారు .నేను రోజు అయన టేబుల్ మీదే కుర్చునేదాన్ని ,రోజు పటికబెల్లం ముక్కలు ఇచ్చేవారు .నా స్కూల్ డేస్ మొదటి సంవత్సరం సంతోషంగా గడిచిపోయింది (ఈ మధ్య మా స్కూల్ ,అప్పట్లో మేము ఉన్న ఇల్లు అన్ని చూసి వచ్చెను .(అక్కడ రెండు ఏళ్ళ తరవాత వేల్లిపోయము ) మల్లి ఇప్పుడే చూడటము,నా సంతోషాన్ని మాటలతో చెప్పలేను .
                                         రెండో తరగతిలోకి వచ్చెను ,నన్ను అక్కని ప్రైవేటు కి పంపించేరు,నేను సైలెంట్ ,అల్లరి చేసేదాన్ని కాదు .అక్క అల్లరి చెప్పక్కరలేదు ,చాల గడుసు ,ఆటలు ,పాటలు.ఆమె ఫస్ట్ ఉండాలి .వేరే ఎవరికయినా వచ్చిందా కంటిచుపుతోనే భస్వం చేసేది . సన్నగా ,తెల్లగా ఉండేది ,స్టైల్ గ తయారవడం చాల ఇష్టం ,అమ్మ జడ వేసినాక చివర్లో నీళ్ళు తడిపి ఉంగరాలు వచ్చేలాగ తిప్పేది ,పౌడర్ టిన్నుమేము ఇల్లంతా పడేస్తామని అమ్మ పైన పెట్టేది ,మన" దాదా" గారికి అందేది కాదు,కానీ మొహానికి పౌడర్ రాసుకుని కాటుక పెట్టుకోవాలి ఏంచెయ్యాలి ?బియ్యం డబ్బా దగ్గరకు వెళ్లి చేతులు దాంట్లో పెట్టేసి ,చిన్న చేతులతో మొహమంతా పులుముకునేది .బియ్యంలో ఉన్న వైట్ డస్ట్ పేస్ మీద ,కాటుక తీసుకుని అమ్మకు తెలియకుండా ఫిష్ ఆకారంలో కళ్ళ చివరివరకు పుల్లతో దిద్దేది .
ప్రవేట్ క్లాసు  లో ఫిఫ్త్ క్లాసు వరకు ఒక గ్రూప్ గా  కుర్చోపెట్టేవారు .అందరికి క్లాసు వర్క్ ఇచ్చేవారు. టేబుల్స్ ,,తీసివేత, కూడికలు ఇచ్చేవారు . మనమందరం ఒక్కసారే మాస్టర్ దగ్గరకు వెళ్లి చుపిద్దము అని చిన్న అక్క మాతో చెప్పేది .నాది ఇంకా అవలేదు మీరంతా మెల్లిగా రాయండి అని చెప్పేది.నాది ముందు అయిపోయిన అమెది అవలేదేమో అని కుర్చునేదాన్ని ,మిగతా ఫ్రెండ్స్ అందరుకూడాస్లోవ్గా రాస్తా ఉండేవాళ్ళు .ఈలోపుచిన్నక్క వెళ్లి మాస్టర్ కి చుపించేసేది ,అందరికన్నా ముందు రాసినందుకు ఆమెని మెచ్చుకుని ,ఇంకా రాయనందుకు మిగతావారిని తిట్టేఅలా ఎందుకు చేసేవు అని అడిగే దైర్యం ఎవరికి ఉండేది కాదు ,ఒకవేళ ఎవరయినా అడిగితె వాళ్ళ పని అయిపోయేది .చిల్డ్రన్స్ డే కి ఆటల పోటీలు పెడితే ,నాకన్నా ముందు పరిగెత్తవద్దు అని సైగ చేసేది నేను నా ఫ్రెండ్స్ మణిమాల ,లక్ష్మి సరే అని తల ఉపే వాళ్ళం.నాకు ప్రైజ్ తీసుకోవాలని  కోరిక ఉండేది ,కానీ ఏమి చేయలేకఎదాన్ని  .తన ఫ్రెండ్స్ కి కూడా కళ్ళతో వార్నింగ్ ఇచ్చేది .అనిట్లో ఆమె ఫస్ట్ తనకే ప్రైజెస్. ఇంతచేసిన ఫ్రెండ్స్ అందరు ఆమె వెనుకే తిరిగేవాళ్ళు .

 ఇంటి లో కూడా ఆమె చెప్పినట్లే చెయ్యాలి ,లేకపోతె అందరితో పోట్లడేసేది.అమ్మ ,నాన్న లు ముద్దుగా "బెడగుండా రాక్షసి" అనిపిలిచేవాళ్ళకారెంబోర్డ్ ఆటలో ఆమెఓడిపోతుందిఅంటే , అన్ని కలిపేసి వెళ్లి పోయేది .ఓటమి అంగీకరించదు .నా రెండవ తరగతి అల గడిచింది ,కానీ ఇప్పుడు అవి అన్ని తీపి గుర్తులు.

                            పెద్దయ్యాక దాదాగిరి మానేసింది మా పండక్క.లీడర్ క్వాలిటీస్ మాత్రం ఉన్నాయి ,కాలేజీ లో కూడా పదిమంది ఫ్రెండ్స్ వెనక ఉండేవాళ్ళు , లేక్త్చురర్స్ ,స్నేహితులు బాగా ఇష్టపడేవారు .తెలివితేటలూ ఎక్కువని అందరు మెచ్చుకునేవాళ్ళు .


అప్పటిరోజులు తలుచుకుని నవ్వుకుంట వుంటాము .ఇప్పుడు తను బాగా చదువుకుని మంచి జాబ్లో ఉంది.

7 comments:

భాస్కర్ రామరాజు said...

పెద్దయ్యాక దాదాగిరి మానేసింది మా పండక్క!!

హ్మ్!! ఇద్దరు పిల్లలుంటే ఒకళ్ళు కనిపించేలా గోల చేస్తే ఇంకొళ్ళలు సైలెంటుగా గోల చేస్తారు.

మా అన్నా నేనూ కూడా అంతే. వాడు నాలుగోతరగతి, నేను ఒకటో తరగతి. వెళ్ళి నాలుగులో వాడిపక్కన కూర్చునేవాణ్ణి.
:):)

కమ్మని జ్ఞాపకాలు.

హరే కృష్ణ . said...

భాస్కరన్న ద్వారా మీబ్లాగు పరిచయం అయ్యింది asitis
"బెడగుండా రాక్షసి" చాలా కొత్తగా సరదాగా వుంది ఈ పేరేంటో గాని
చాలా బావుంది మీ టపా

anagha said...

@భాస్కర్ గారు ,
అంటే నేను సైలెంట్గా అల్లరి చేసేధాన్నని అనుకుంటున్నారా ?ఆ చాన్స్ లేదండి ,తను నడిచేటప్పుడు కూడా పక్కన నడవకూడదు ,ఒక్క అడుగు మేము వెనకాల నడవాలి .తన బుక్స్ ఉన్న బాక్స్ నేనే మొయ్యాలి ,ఎంత అన్యాయం చుడండి !
ధన్యవాదాలు .
@కృష్ణ గారు ,
"బెడగుండ రాక్షసి" అంటే రాక్షసులకి హెడ్ అంటే పెద్ద రాక్షసి , పిల్లల కథల పుస్తకాల్లో ఉండేది.
ధన్యవాదాలు .

చిన్ని said...

తప్పు తప్పు .....అక్కలని ఎవరైనా ఇలా ఆరబోస్తార ! ఆ దాదా మీకు ఎంత రక్షణ కలిపించేదో బయటి వారినుండి :):)

anagha said...

@చిన్ని గారు ,
మేము అక్క ,చెల్లి బంధం కన్నా ఫ్రెండ్స్ లాగ ఉంటాము .

మురళి said...

బాగున్నాయండీ మీ జ్ఞాపకాలు.. ముఖ్యంగా పౌడర్ రాసుకునే సీన్.. మీ రాక్షసి గారి తెలివి తేటలు మెచ్చుకుని తీరాలి :):):)

anagha said...

@మురళిగారు ,
అవునండి ,తెలివితేటలూ అమోఘము .
ధన్యవాదాలు .