Friday, February 12, 2010

దేవుడున్నాడు !

                                        శివరాత్రి శుభాకాంక్షలతో ....

          
                                        ఆరు ఏళ్ళ క్రితం ,ఒక ఆదివారం ఇంట్లో పని అయిన తరువాత  పన్నెండుగంటలకు కూర్చుని   పుస్తకం చదువుతున్నాను.
                                  
                                            చుట్టూ శూన్యం ఎక్కడ ఉన్నానో అర్ధమవలేదు.అంతట చీకటి అక్కడక్కడ మినుకుమినుక మంటూ చుక్కలు ,చుట్టూ చూస్తే ఎవ్వరు లేరు , అమ్మో! ఎక్కడకు వచ్చెను ?ఎవ్వరు లేరు ,తెలియని చోటికి వచ్చెను  వెళ్లిపోవాలి అని ప్రయత్నిస్తున్న,కానీ వెళ్ళాలని చూస్తే గాల్లో తేలుతున్నాను .భయంతో  చెమటలు పట్టాయి ఇంటిలో అందరిని పేరు పేరు నా  పిలుస్తున్న ఎవ్వరు పలకడం లేదు .పై పైకి వెళ్ళిపోతున్న ,చాల సేపు ప్రయాణం తరువాత తెల్లటి ప్రదేశానికి వచ్చెను .చుట్టూ చల్లగాలి ,అంత మంచు, నడుస్తున్నాను .ఎటునుంచి ఇంటికి వెల్లాల అనే ఆలోచనే !కొంతదూరం నడిచేను ,అంతే! ఎదురుగ శివ పార్వతులు నావైపే చూస్తున్నారు ,నాలో ఆనందం ,భయం ."దయచేసి నన్ను పంపించెయ్యండి ,నాకు అమ్మాయి ఉంది నాకోసం ఎదురు చూస్తా ఉంటది"అటు వైపునుంచి ఉలుకు లేదు పలుకులేదు .వాళ్ళ కాళ్ళ దగ్గకుర్చుని ఒకటే బతిమలుతున్న ,వారు మాత్రం ఏమి మాట్లాడకుండా ప్రసాంతంగా నావైపు చూస్తున్నారు .నాకళ్లలో నీళు,ఇంకా అక్కడనుంచి లేచి వారి చుట్టూ తిరిగి దారి కనపడద్దేమో అని వెతికేను ,ప్చ్ !నిరాశే ఏడుస్తూ మళ్ళి వారి దగ్గరకు వచ్చెను ,నా ప్రాణమంత మా అమ్మయి చుట్టూ ఉంది .మళ్ళి పంపించేయ్యమని బ్రతిమలేను .కొంతసేపటికి మళ్ళి నేను చీకటిలో , సూన్యంలో ఉన్నాను ,గాల్లో ప్రయాణం.


                    ఉలిక్కి పడి చుట్టుచుసేను పుస్తకంనా చేతుల్లోనే ఉంది . టైం చుస్తే ఒంటిగంట దాటింది ,ఒక్కసారే గుండె లబడబ్ చప్పుడు నాకే విన్పించింది టెన్షన్ తో వళ్ళంతా చమటలు పట్టాయి .హమ్మయ్య ! ఇంటిలోనే ఉన్నానా ?అంతా గుర్తు వచ్చింది ఒక్కసారే వళ్ళుజలతరించింది . ఇంటిలో అందరితో చెప్పెను, అచ్చర్య పోయారు.శివపార్వతులు ఎందుకు కన్పించారో నాకు అర్ధమవలేదు !కనీసం నేను తలుచుకోవడం కూద చెసెదన్ని కాదు, నిజంగా శివపార్వతులు మంచుకొండల్లోనే ఉంటారా!చాల కాలం వరకు ఆ దృశ్యాన్ని మర్చిపోలేకపోయా .అప్పటినుంచి ఏదో ఒక సంఘటనలు జరుగుతుండేవి .
 
                                                    * * * *


మా ఇంటిలో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి నే పుజిస్తారు .చిన్నప్పుడు ఎక్కువగా తిరుపతి తీసుకు వెళ్ళేవారు ,శివాలయాలకు తక్కువుగా తీసుకు వెళ్ళేవాళ్ళు.శివరాత్రి అప్పుడు మాత్రం తీసుకువెళ్ళేవారు . అందుకేనేమో పెద్దయ్యాక దేవుడంటే వెంకటేశ్వరస్వామి ,షిర్డీ సాయి బాబా నే ఎక్కువగా పూజ చేసేదాన్ని.అందరిలాగే నాకు పెద్ద డైలమ ,అసలు నిజంగా దేముడున్నాడా!ఎప్పుడు నాలో సంఘర్షణ,పైన సంఘటనతో నాకు దేముడున్నాడు అని నమ్మకమేర్పడింది .అప్పటినుంచి శివాలయానికి ప్రతి సోమవారం వెళ్ళటం ,ఏ కష్టమొచ్చిన ఓం నమః శివాయ అనుకోకుండా ఉండలేను .ఏ వూరు వెళ్ళిన శివాలయం వుంటే దర్శించుకుంట .శివుడు నాకు ఇష్ట దైవం అయ్యాడు.ఈ సంవత్స్తరం శివరాత్రి రోజే మా పెళ్లి రోజు కూడా అవడం చాల ఆనందగా వుంది .
                        
          మాములుగా అయితే  ఒక్క పూట కూడా తినకుండా  ఉండలేను .కాని కార్తీకమాసం ,శివరాత్రి కయితే  ఉపవాసము ఉండగలను .ఇదంతా మన సంకల్పబలమేమో !

8 comments:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

!!!!

Bhãskar Rãmarãju said...

God Bless You!!
*ఒక యోగి ఆత్మ కధ* కళ్ళముందు కదిలింది..

మురళి said...

నిజంగా ఆశ్చర్యమేనండీ.. శివరాత్రి మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు (కొంచం ఆలస్యంగా)

anagha said...

@మందాకినిగారు,
ధన్యవాదాలండి.
@రామరాజుగారు,
ధన్యవాదాలు ,ఒక యోగి ఆత్మకథ నేను పది సంవత్సరల క్రితం చదివాను ,మళ్ళి చదువుతాను.
@మురళి గారు ,
ధన్యవాదాలు,

Vasuki said...

మీ అనుభూతి బాగుంది. ధ్యానం ద్వారా తిరిగి అలాంటి అనుభూతికి ప్రయత్నించండి.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

వేకటేశ్వరుని మనమంతా విష్ణూమూర్తి అవతారంగా తలుస్తున్నా నిజానికి శంకరాచార్యులు అక్కడ వేసిన యంత్రంలో శక్తిరూపం, శివతత్వం, వైష్ణవాంశ కలిసి ఉన్నాయి. తదనంతరం దక్షిణాదిలో శైవవైష్ణవాల మద్య జరిగిన పోరాటాల తర్వాత అందులోనూ కృష్ణదేవరాయల కాలంలో వైష్ణవీకరించబడింది. అన్నమయ్య కూడా "ఎంతమాత్రమున.."అనే కీర్తనలో చెప్పాడుకూడా. అబ్బో చాలా ఎక్కువరాసేశా.

శేఖర్ పెద్దగోపు said...

నాకూ ఆశ్చర్యం వేసింది...చాలా కొద్ది మందికి మాత్రమే ఇలా కనపడటం జరుగుతుంది...

anagha said...

కంప్యూటర్ ప్రాబ్లం వలన ఆలస్యంగా సమాధానం ఇస్తున్నందుకు క్షమించండి.
@వాసుకిగారు ,
ధన్యవాదాలండి . ప్రయత్నమెందుకండి,చివరకి వెళ్ళేది అక్కడికేకథ .
@చైతన్య గారు ,
ధన్యవాదాలండి .
భగవంతుడు ఒక్కడే అని నమ్ముతాను .మంచి మనిషిగా ,పక్కవారిని బాధపెట్టకుండాజీవిస్తే చాలు అనుకుంటాను .
@శేఖర్ గారు ,
ధన్యవాదాలండి .
అవునండి ఆచ్చార్యమే ! అదృష్ట్తంగా బావిస్తాను.అప్పుడు మాత్రం చాల భయమేసింది .