Thursday, August 20, 2009

నా గుండె జారిన రోజు-2

ట్యూషన్ కి వెళ్ళాను అన్నాను.మా అమ్మ ట్యూషన్ టీచర్ కి స్వీట్స్ తీసుకుని వెళ్ళమని అన్నది .స్వీట్స్ ఇచ్చేసి ఆవిడ దగ్గర పెర్మిషన్ తీసుకుని వచ్చేద్దామని వెళ్లాను .మా టీచర్ బర్త్ డే విషెస్ లెక్కల పుస్తకం తీయమంది .ఎగ్జామ్స్ వున్నాయి కాబట్టి తప్పదుఅన్నది.నా ఆనందం అంతా ఒక్కసారే ఎగిరిపోయింది.
బలవంతాన బుక్ తీశాను ,దూరంగా కొండ మీద నుంచి మురుగన్ స్వామి గుడినుంచి పాటలు వినిపిస్తున్నాయి .అక్కడ పారిజాతం పూల చెట్టు వుంటుంది ,అక్కడ కుప్పలుగా పూలు రాలి పది వుంటాయి .వాటిని ఏరుకుని ఆడుకోవడం నాకు చాల ఇష్టం .అందుకే ముఖ్యంగా గుడి కి వెళ్ళేదాన్ని .
నా ఆలోచనలన్నీ గుడి చుట్టూనే తిరుగుతున్నాయి ...ఎప్పుడేపుడుపుస్తకం మూసి ఇంటికి వెళ్తానా అని...టీచర్ మీద చాల కోపంగా వుంది ,ఎలనైతేనేం ట్యూషన్ అయ్యిందనిపించాను .నేను బయలుదేరబోతుండగా టీచర్గారు నాకో ప్యాకెట్ అందించారు ..నాకు ఆశ్చర్యం అక్కడే గబగబా విప్పి చూసాను ,ఆలివ్ గ్రీన్ గోల్డ్ కలర్ అంచు వున్నా ఇంకు పెన్ను ,పెన్సిల్ ఎరైసేర్ ,స్కేల్ ....నేను గాల్లో తెలిపోయాను ,అప్పటిలో ఐదులోకి వస్తే కాని పెన్ ఇచ్చేవారు కాదు ,నేనేమో నాలుగాయే ,నాకంటూ స్వంత పెన్ రావడం ...అబ్బో ఎంత ఆనందమో ....పదేపదే చూసుకున్నాను ..అప్పటివరకు ఆవిడ మీదున్న కోపం ఎగిరిపోయింది.ముందు అక్కవాళ్ళకి చూపించాలి ,థాంక్స్ కూడా చెప్పలేదు ,ఒకటే పరుగు ...ఇంటికేసి ,ట్యూషన్ నుండి కొంత దూరం నడిచి మలుపు తిరిగాను ,ఒక్కసారి మళ్లిపెన్ చూడాలి అనిపించింది ,అప్పుడే చీకటి అలుముకుంటుంది ,బాగ్ నుండి పెన్ తీసి చూసుకుంటున్నాను ,చేతినుండి పెన్ జర్రున జారి పడింది ,నేను కిందకి చుస్తే నేను నిలబడి వున్నది బండరాళ్ళు పరిచి వున్నా డ్రైనేజి ,రాయికి రాయికి మద్య చిన్న సందు ,ఆ సందులోకి నా పెన్ జారిపోయింది .....పెన్ కాదు నా గుండె జారిపోయింది ,చాలాసేపు తొంగి చూసాను ఎక్కడ జాడలేదు ......కళ్ళ లో నీటితో బరువెక్కిన గుండె తో ఇంటికి బయలుదేరాను ....అటు గుడికి చెడ్డాను ..ఇటు పెన్ను దక్కిన్చుకోలేకపోయాను ,కాని ఇంట్లో వాళ్ళతో మాత్రం పోయిన నా పెన్ గురించి వర్ణించి వర్ణించి చెప్పి తృప్తి పడ్డాను .ఆ రోజు మొదలు నేను ట్యూషన్ కి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ప్రతిరోజు పెన్ పడ్డ చోటు బండల మద్యలోకి చూసి వెళ్ళేదాన్ని ,ఎప్పటికైనా కనిపిస్తుదేమోనని ...

6 comments:

తృష్ణ said...

very sad..paarijaataalaMTe naakU bOLEDu iShtam andi..

పరిమళం said...

బ్లాగ్ లోకంలోకి స్వాగతం !కాస్త ఆలస్యంగా చెపుతున్నా ఏమనుకోకండీ ..
ప్చ్ ....కొన్నిసార్లు అంతే ఇష్టపడింది దక్కదు ...కానీ మీ జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి చూశారా ...

ప్రియ said...

హ్మ్. అయ్యో అనిపించింది.

విశ్వ ప్రేమికుడు said...

మీ పేరులాగే మీ బ్లాగు పేరుకూడా చాలా బాగుంది.

మీ పోస్టుతో పాటు మమ్మల్నీ మీ మీ మురుగన్ స్వమి గుడికి తీసుకు వెళ్లారు. మీ పెన్నుని మా మదికి తాకిఛ్ఛి చూపించారు. మీ పెన్ను మీదగ్గర లేకపోయినా దాని తీపి గురుతులు మిగిల్చి వెళ్లింది. చాలా బాగారాశారు. ప్రశంసలు.

బ్లాగు లోకానికి స్వాగతం. :)

భాస్కర్ రామరాజు said...

చాలా అత్భుతంగా చెప్పారు!!

అన్నట్టు అనఘ అంటే ఎవరు?

http://ramakantharao.blogspot.com/2008/10/blog-post_14.html

Please remove word verification

anagha said...

@trishna
naa blog visit chesinanduku danyavadalu
@parimalam
dhanyavadalu
@priya
thankyu
@viswapremikudu
naku godavari ante chaalachalapraanam,anduke aa peru. naa pen mee madhini thattinanduku thanks.
@baskara ramaraju
anagha ante parvathidevi, sinless ani kooda ardham , maa naanna garu naku manchi perupettarandi .dhanyavadalu ...mee post chadivanu