Sunday, August 23, 2009

బొజ్జ గణపతి

నా చిత్తూర్ జ్ఞాపకాలు లో మరొకటి . బయటనుంచి అరుపులు ,కేకలు.నిద్రలో ఉన్నానేమో ఉలిక్కిపడి లేచాను ,టైం చూస్తే ఉదయం ఎడుగంటలూ ఆరోజు ఆదివారం స్కూల్ లేదు .బయటికి వచ్చి చూసేను .అప్పటికే అమ్మ గేటు లో నుంచుని వుంది.పక్కింటి సుబ్రహ్మణ్యం తన ఇద్దరి బార్యలని రోకలిబండ తో తన్నుతున్నాడు ,మద్డ్యలో వాళ్ళకున్న పొడవాటి కురులను మెలిపెట్టి నేలకేసి కొడుతున్నాడు .చుట్టూ జనం బొమ్మల్లా చూస్తున్నారు .అమ్మ కోపాన్ని ఆపుకోలేకపోయింది .అపూ !వాళ్ళమీద చెయ్య పడిందా మర్యాదగా వుండదు ,అనిఅరచింది .సుబ్రమణ్యం కూడా షాక్! రోకలిబడని పడేసి ఇంట్టిలోకి వెళ్లి తలుపు వేసుకున్నడు .చట్టువున్నవారు అమ్మని అభినందిన్చేరు .రోజ్జుఇదే గొడవ అమ్మకూడా పట్టించుకునేది కాదు మనకెందుకులే అనుకునేది ,ఆరోజు మాత్రం అదేబ్బలకి వారు బతకరేమో అని వారి విషయంలో కల్పించుకుంది అమ్మాంటే అచుట్టుపక్కల గౌరవం ఆఫీసర్ గారి వైఫ్ గ అందరు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు . సుబ్రమణ్యం వాళ్ళుమాపక్క ఇంటిలోవుండేవారు ,వారిది పెద్ద లోగిలి ఇల్లు ,కంపౌండ్లోనే పది మగ్గలదాకవుందేవి .చీరలు నేస్తవుండేవారు ,పీలగాపోట్టిగా తెల్లగావుండే సుబ్రమన్యంకి బార్య నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు .బార్య మంచి హైటు మొకల్లవరకువుందే పొడవాటి కురులు, చెల్లెలు సరోజ ఇంక అందంగా వుంటుంది .ఈ పొట్టి హీరో మరదలినిఇష్టామంట ,నాకు !మీ చెల్లి ని ఇచ్చి పెల్లిచేయ్యండి లేకపోతే చచిపోతనని అనేవాడట !అలబార్యని హింసించేవాడు.నిజంగానే రొండు సార్లుఎట్టేమ్ప్ట్ చెస్తే దానితో ఆమె బయపడి పేరెంట్స్ ని చెల్లి ని బతిమాలి మంగల్యాన్ని రక్షించమని కోరిందంతా .వాళ్ళు ఒప్పుకోలేదు చివరికి ఎలాగైతేనేమి వప్పిచింది . తన కా పురాన్ని షేర్ చెయ్యలంటే ఎవరికిఇష్టం వున్నటుంది ,అది సొంత చెల్లితో !సరోజకి కష్టాలు ప్రారంబం ,అక్క సరిగ్గా తిండి పెట్టెకాదంట మాటలతో చేతలతో బాగా బాద పెట్తేదాంత .సరోజ కి ఒక బాబు పుట్టెడు కష్టాలు ఇంక ఎక్కువయ్యంత.సరోజతో మాట్లాడేవారే లేరు చుట్టుపక్కలఎవరితోను మాట్లాడనిచ్చేదికదంతా .బాధలు బరించలేక సరోజ ఎదురు తిరగడం మొదలుపెట్టింది .రోజు యుద్ధం అగోదవతో ఇద్దరినీ కొట్టడం మొదలు పెట్టేడు . వల్లామ్మయలు గీత లతా నాస్నేహితులు వాళ్ళతో ఆడుకుంటూ వుండేదాన్ని వాళ్ళింటిలో మగ్గాలమీదే నేస్తూవుంటే నాకుఅచ్చర్యంగా వుండేది !మగ్గాలు కాలిగా వున్నపుడు నెను ట్రై చేసేదాన్ని చాలకష్టంగా వుఉండేది .సరోజ కొడుకు మూడేళ్ళ వాడు ముద్దుగా బొద్దుగా చేరు బొజ్జతో వుఉండేవాడు .వాడంటే నాకు చాల ఇష్టం ,అసలు పిల్లలంటేనే నాకు ఇష్టం నావయసు ఎనిమిది , కాని పెద్దదని లాగ ఇంటి పక్క పిల్లలందరినీ అందరిని ఆదిచ్చేదాన్ని .గణపతిని మాఇంట్లో బొజ్జ గణపతి అని పిలిచేవాళ్ళం సరోజ కొడుకుఅని ఎవరు ఎతుకునేవారు కాదు .సరోజబాధలని అమ్మతో షేర్ చేసు కునేది .నెను ఎక్కువ గణపతి తోనే ఆడుకునేదాన్ని .అక్కాచెల్లెలు మంచి ముడ్లో వున్నప్పుడు వారి వంటకాలని మాకు పంపిస్తవుందేవాళ్ళు .మేము పక్క కృష్ణ జిల్లవాళ్ళం .వారి మునగాకు పోల్లింపువిత్ వేరుసేనగాపొడి ,పప్పు మునగాకు ,అవిసకు పోల్లింపు ఇలా రక రకరకాల వంటకాల వంటకాలు ఇస్తూ న్దేవాళ్ళు .మేము తినలేకపోయేవాళ్ళం .బొజ్జ గణపతి మాత్రం అన్ని తినేవాడు చిరు బొజ్జ తో షర్టులేకుండా తిరుగుతుండేవాడు .ఇంట్లో గొడవజరిగినపుడు మాత్రం బిక్కమోహంవేసుకుని చూసేవాడు .సంవత్సరం తరువతనన్నగారికి బదిలీ మీద కొవ్వూరు వేల్లిపోయీము .వచ్చేస్తుంటే అందరుబాధపడ్డారు . ముఖ్యంగా సరోజ తనకిదైర్యాన్ని ఇచ్చే వారు వేల్లిపోతున్నారని బాధపడింది .నేను గణపతిని వదలివేల్లతకి బాదపద్దను . . అయిదు ఏళ్ళ తరవాత పనిమీద , నాన్నగారి ఆఫీసు వాళ్ళు మా ఇంటికి వచ్చేరు .వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉండేవారు ,అమ్మ !గణపతి వాళ్ళు ఎలా వున్నరు అని అడిగింది .ఇంకెక్కడి గణపతి ,మీరు వచ్చేసిన సంవస్తరం తరువాత ఒక తెల్లవారు జమున సరోజ ,గణపతి వారి ఇంటి పెరట్లో వున్నా బావి లో కన్పించారు !అని చెప్పేరు .అందరం షాక్ !

5 comments:

పరిమళం said...

so...sad ....

విశ్వ ప్రేమికుడు said...

అయ్యో పాపం..... :-(

విశ్వ ప్రేమికుడు said...

మీరు చాలా చక్కగా రాస్తున్నారు. ఈ పోస్టులొ అక్షర దోషాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. వాటిని తొలగించగలరు. లేకుంటే చదివేవారికి ఇబ్బంది. మీ పోస్టు బాగున్నా అక్షర దోషాల వల్ల పూర్తిగా చదవరు.

ఆ వర్డ్ వెరిఫికేషన్ కాస్త తొలగించ గలరు.

మీరు ఈ లోకానికి కొత్త అని, ఓ చిన్న సలహా ఇచ్చాను. అన్యధా భవించకండి. :)

anagha said...

@parimalam
irojullo ilanti kathalu yenno...thankyou.

anagha said...

@viswa premikudu
thanks for your suggestion, iwill try...