Friday, September 4, 2009

మల్లన్న ఎంతపనిచేసేవయ్య !

రాత్రంతా ఏమని అడిగెను నిన్ను !
మారాజు ని రారాజు ని జాగ్రత్త చూసుకోమని ,నీకుదగ్గరలోనే ఉన్నాడని తెలిసి ఇంక భయము లేదు అనుకున్నా ,
నువ్వే రక్షించి తీసుకువస్తావని ,వెయ్యి కళ్ళతో ఎదురు చూసా కాని
నా ఆశని ఆడి ఆశని చేసేవు !
అడవిలో తప్పిపోయిన నీ బిడ్డన్లి ,ఆ చీకట్లో కారడవిలో,జోరున వస్తున్న వానలో
వదలివేయటానికి నీకు మనసు ఎలా ఒప్పింది ?
నిన్ను రక్షించమని అడగలేదని కోపమా!
వేరె దైవాన్నిపూజిస్తున్నారు ,వారే చూసుకుంటరులే అనుకున్నవా ?
ఎంత నిర్ధక్షన్యంగా వదిలివేసేవు ,ఇంతకటినమ నీ మనసు!
రాత్రంతా నిజపమే చేసేనుగా ,రాజన్ననీ రక్షించమని .
ఎందుకు ఇలా చేసేవు ?ఈ బాధని తట్టుకోలేక పోతున్నాను
నువ్వు కాకా ఇంక ఎవరితో చెప్పుకోను ?
చెప్పు .....చెప్పు........చెప్పు .........చెప్పుశ్రీశైల మల్లన్న!

No comments: