Friday, September 4, 2009

నీ జ్ఞాపకాల నీడలు .....

ముఖ్యమంత్రి గారి క్యాంపు ఆఫీసు ,సమయ 4గంటలు అవుతుంది పచ్చని లాన్లో కుర్చుని ఎదురు చూపులు .మసులో సియం గారిని చూదబోతున్నందుకు నాకు, నాతోటి స్నేహితులకు పెద్ద టెన్షన్ .మేమందరమూ కలసి సియం గారికి వినతిపత్రం ఇవ్వడానికి కూర్చున్నాం .తరవాత మమ్మల్ని చెక్ చేసి విజిటర్స్ రూంలో కూర్చోమన్నారు .ఆరోజు వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి గ ప్రమాణం చేసిన రోజు ,ఇలోపు విజిటర్స్ ఎక్కువయ్యారు !ఇంతలో ౩పేద్ద కార్లు వచ్చే సరికి సియం అనుకున్నాం ,కానీ పీద్ద బోకే తో రోశయ్యగారు ఇంకా ప్రమఖులు అబ్బో !మోహన్బాబు ,ధర్మవరపుఇంక చాలామందిdప్రముఖులు వచ్చారు . బలే టైం పాస్ ,ఆరు దాటుతుండగా సియం కాన్వాయ్ వచ్చింది .అందరు నన్నే వినతిపత్రం ఇవ్వమన్నారు .చేతిలోరేడ్ రొసేస్ బోకే తో నేను రెడీ .

చాల అనందం ,ఉద్వేగం!రాజ శేఖరుడు రాజసం ఉట్టిపడుతూ,చిరునవ్వు తో మెరిసిపోతూ అందరి కి నమస్కారం పెడుతున్నారు .విజిటర్స్ దగ్గరకు వచ్చారు ,బోకే ఇచ్చెను ,వినతి పత్రం ఇస్తుంటే సెక్యూరిటీ వాళ్ళు దూరంగా వుండాలని రోపేపెట్టేరు ,మీరు ఉందండయ్య అని రామ్మా చెప్పు అని ఆప్యాయంగా చేతులు పట్టుకున్నారు . అయన సియం అయినతరువాత మొదటి వినతి పత్రం అదే అనుకుంట ,మేము అయన దగ్గర ఆటో గ్రాఫ్ తీసుకున్నాము .తరువాత మేము అయన పక్కనే చాలాసేపు ఉన్నాము .ప్రముఖులు ఇచ్చిన బొకేలు అందమయిన గులాబీలు మాకు ఇచ్చేరు .ఆ బొకేలని హాస్టల్ తెచ్చు కుని మురిసి పోయాము ,బద్రంగ చాలాకాలం దాచుకున్నాము .అల ఆపనిమేదే ప్రియతమ నాయకుడిని రెండు మూడు సార్లు కలిసేము అదేఆప్యాత .నినుమరవగలమా !.


!