Wednesday, September 23, 2009

ఈ తరం తల్లులు

"మమ్మీ ,నువ్వు బతికే వున్నావా ?"భయంగా చూసేరు వంశి ,కృష్ణ .

"అదేంటిరా !అల చూస్తున్నారు ,మీ అమ్మనిరా !"స్కూల్ కి వచ్చి తన పిల్లలని చూసి బోరున ఏడ్చింది మాధవి ."నువ్వు చచ్చి పోయావని డాడి చెప్పారు !"ఇంక అనుమానంగానే చూస్తూ చెప్పేరు .పిల్లలిద్దరిని దగరకు తీసుకుని ,తను చని పోలేదని ,బ్రతికే ఉన్నానని వారితోకొంచం సేపు గడిపి వెళ్ళిపోయింది .

మర్నాడు మాధవి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకు వచ్చింది ,భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవల వలన ఇంటిలోనుంచి వేల్లిపోమ్మనాడు ,పిల్లలు స్కూల్కి వెళ్ళిన సమయములో నన్ను బయటకు నేట్టేసేడు .అప్పటినుంచి నా పిల్లలని చూసుకునే అవకాసం లేకుండా పోయింది .పిల్లలని చుస్తకి వీలేదు అంటున్నాడు , నా పిల్లలు నాకు కావాలి అని చాల ఏడ్చింది .పాపం అన్పించింది ,తను చుస్తకి చాల చక్కగా ఉంది ,వయసు ముడుపదులు ఉండవచ్చు .ఆమె భర్తా పోలీస్ డిపార్టుమెంటు అంట ,డివోర్స్ కి కూడా అప్లై చేసేదంట.

ఇది మాధవి గా !

ఇలాంటి కధలు రోజుకి ఎన్నో , డీ వీ చట్టం వచ్చాక మహిళలు దైర్యంగా బయటకి వచ్చి సహాయము కోరుతున్నారు ,మగ మహారాజులు విడాకులు కావలి అంటున్నారు . మధ్య విడాకులు ఎక్కువయ్యాయి .పిల్లల సంగతి ఆలోచించేదేవరు ?ఎవరికి వాళ్ళు పంతాలు ,పట్టింపులు .మన సంసృతి కూడా మారిపోతుంది.

సరే ఇంతకి మాధవి బాధని అర్ధం చేసుకుని ,ఆమె భర్తా గారిని పెలిపించడం జరిగింది .'తల్లి పిల్లలని వేరు చేయడం నేరము మీకు ఎంత హక్కు ఉందొ ,ఆమెకు అంతే హక్కు ఉంటుంది ,ఆమె పిల్లలని చూసుకోవడానికి అవకసమివ్వండి ,తల్లికి ఎంత భాద ఉంటుందో మీకు తెలియదు 'అని అతనితో చెప్పడం జరిగింది .

నేను చెప్పేది కూడా వినండి అని అతని కథ చెప్పడం మొదలు పెట్టేడు ........వారిది ముచాటైన చిన్న సంసారం తొమిది , ఎనిమిది వయసున్న ఇద్దరు కొడుకులు .సొంత ఇల్లు ,ఆర్థిక ఇబ్బందులు లేవు ,ఇద్దరు డిగ్రీ చదివినవాళ్ళు ,అతనిది గవర్నమెంట్ జాబు ,ఇంకేమిటి సమస్య ?

వీళ్ళకి గోపాలరావు గారు అనే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారంట ,వల్ల అబ్బాయిmadhu ,మాధవి అయన ఇద్దరు చాల బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ అంట .పండగలకి పబ్బాలకి రావడం,వెళ్ళడం . పరిచయం కాస్త మాధవి, మధు స్నేహం ఎక్కువయ్యింది .అది కాస్త ప్రేమగా మారింది ,ఇద్దరు విడిగా ఉండలేని పరిస్థితి !గొడవలు మొదలవడము ,ఇంటిలోనుంచి పంపించైయ్యడము జరిగింది .ఆమె కూడా భర్త ని పిల్లలని వదిలేసి ప్రేమ కోసం వెళ్ళిపోయింది .ఇప్పుడు పిల్లలు కవల్సివచ్చార ?అని తన బాదనంత వెల్ల గక్కడు .

ఆచర్యపోవడం మవంతయింది ,ఎంతో అవమానం తో తలదించుకుంది .ఆమె మీ చాల కోపంగా అన్పించింది .పిల్లలని నాదాలుగా చేసి ,ప్రేమ కోసం vellevariki ఏమని న్యాయం చెప్పాలి ......

1 comment:

monkey2man said...

paristitulu alane unnayi Ee rojulalo