Monday, September 14, 2009

నాగరాజు 2

నేను,అమ్మ వాళ్లఇంటినుంచి మా ఇంటికి వస్తున్నాను ఎవరో నన్ను ఫాల్లో అవుతున్నట్లు అనిపించింది .వెనక్కి చూస్తే ఎవరులేరు కొంత దూరం నడిచేను ,మళ్లిఫాలో అవుతున్నాటు అనిపించిది ,వెనక్కి తిరిగి కిందకి చూసేను ,అమ్మో !ఇంకేముంది పెద్ద పాము (అనకొండ టైపు ) అంతేపరుగో పరుగు ,చాల సేపు పరిగెత్తేను విసలమయిన మైదానం అంత ఇసుక పరిగెట్టాలంటే చాల కష్టంగావుంది దూరంగా వాటర్ కనిపిస్తుంది .ఎక్కడికి వచ్చాను ?వెనక్కి చూసేను అది చాల స్పీడు వస్తుంది .ఇంక తప్పించుకోలేను నాపని అయిపొయింది !చమటలు కారిపోతున్నాయి ,మళ్లి పరుగు ......చెట్లు తుప్పలు దాటుకుని గుడి కూడా కనిపిస్తుంది కాని ఎక్కడ మానుష సంచారం లేదు .కాలు ఇసుకలో సగం కూరుకు పోతుంది ,అయిన పరుగు ఆపలేదు తారురోడ్ వచ్చింది .చుట్టూ చూస్తే యక్కడలేదు హమ్మయ్య అనుకుని చెట్టుకింద ఆగేను .క్షణం లో మళ్లి ప్రత్యక్షం ,మళ్లి పరుగు గుడి లాంటి చిన్న ఇల్లు తలుపులు తోసుకుని వెళ్లి తలుపులు వేసుకున్న .హమ్మయ్య !దేవుడా రక్షించేవు .

ఎవరో నన్ను తఃట్టి లేపు తున్నారు ,తుళ్ళిపడి లేచెను ,చూస్తే ఎదురుగ మా హస్బండ్ ఏమయింది ?అడుగుతున్నారు .ఇంతకి కల ,టైం చూస్తే తెల్లవారుజాము నాలుగు ,ఎంత టెన్షన్ పడ్డాను !కలానుకోగానే హ్యాపీ ఫీల్ అయ్యాను .

* * * *

రొండు రోజుల తరువాత రాజమండ్రీలో వుండే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి ఆహ్వానం వాళ్ల ఇంటిలో చిన్న ఫంక్షన్ కానీ తప్పకుండ వెళ్ళాలి .ఆరోజు ఆదివారం రాజమండ్రి కి వేల్లేము ,ఫంక్షన్ అయిపొయింది ఎవరో ప్రపోసల్ బోజనాలు అయ్యాక పట్టిసీమ వెళ్దామని ,ఎప్పుడో నచిన్నప్పుడు శివరాత్రి పండగప్పుడు బోట్లో గోదావరినది మధ్యలో ఉండే గుడికి తీసుకి వెళ్ళటం గుర్తు .అందులో గోదావరి దగ్గరకు నేను ఓకే అన్నాను .అందరమూ బయలు దేరి వెళ్ళే సరికి నాలుగు అయిపొయింది .టికెట్స్ తీసుకుని బోట్ ఎక్కేము ,గోదావరి మధ్యలో అబ్బ !ఎంత అందగా ఉంది ,ఏమని వర్ణించను ?చేతికి అందిన నీళ్ళతో ఒకరిమీద ఒకళ్ళం నీళ్లు చల్లుకుంటూ సరదాగా గడిపేము అంతలోనే నది మధ్య లో ఉన్నా లంక ధగ్గరకువచేము .ఎదురుగ గుడి కన్పిస్తుంది బోట్ దగ్గర నుంచి కొంత దూరం నడవాలి ,ప్రకృతి అందలనిచూస్త నడుస్తున్నాము .ఇసుకలో స్పీడుగా నడవలేక పోతున్న అందరిలో నేను కొంచం వెనకపడ్డాను ,నడవాల్సింది ఇంక చాల ఉంది .ఇదంతా ఎక్కడో చుసినట్లన్పించింది ,వెంటనే కల గుర్తు వచ్చింది .అవును!ఇదే ఇసుక ,నీళ్లు ,తుప్పలు చిన్నగుడి ,నాకు షాకు !అంతే ,గబగబా నడచి అందరితో చేరెను .ఆరోజు జనాలు ఎక్కువ లేరు .గుడి చాల ఎత్తులో ఉంది ,గుడి ఫై నుంచి చూడాలి గోదావరి అందాలని .దేవుడి దర్సనం అయ్యింది .అందరు వెళ్ళిపోతున్నారు సూర్యుడు అస్తమించుతున్నాడు .పుజరిగారు మాకు స్థల పురాణం గూర్చి చెప్పేరు .లాస్ట్ బోట్ అంట ,త్వరగా వెళ్ళమన్నారు .కానీ ఎవరికి కథలలని లేదు .నాకు మనసులో కొంచం బయం ,కలలోక నిపించదమేంటి ,అక్కడకే రావడమేంటి .అందరితో చెప్పాలని అన్పించింది కాని నమ్ముతారా ?మసకచికటి వచ్చేసింది ,ఏమో నాగరాజు వస్తాడేమో వస్తే ,యక్కడ తప్పించుకోవాలిఎందుకు తొందర పడుతున్నానో వాళ్ళకి అర్ధమవడం లేదు .మేము బోటు కోసం నిల్చున్నాము .చిన్నబోట్లో వెళ్ళే కుర్రాడు బొట్టు వెళ్ళిపోయింది అన్నాడు .ఇంక బోటు లేదు ,ఏంచెయ్యాలి ?వెన్నెల్లో గోదావరి ,ఇసుక తిన్నెలు ,మెరిసిపోతున్నాయి .ఇంతలోగుడి క్లోజ్ చేసి స్టాఫ్ కూడా బోట్ దగ్గరికి వచ్చేరు .వెళ్ళిపోయింది అని చెప్పగానే ఫోన్ చేసే వేరే బోటని పిలిపించేరు .బొట్లోకి ఎక్కినతరువాత అందరం ఉపిరి పీల్చుకున్నాము .బొట్లోనుంచి గుడిని చూస్తే నది మధ్యలో అందంగా కన్పిస్తుంది ,వరద వస్తే గుడి మొతం మునిగిపోతుంది అని మా చిన్నప్పుడు అనేవారు ,గుడి అనేదేకన్పించదు .

ఇప్పుడు సరిగా ఎంజాయ్ చెయ్య లేక పోయా !మళ్లి వెళ్ళాలని ,బోట్ లోనే తీర్మానం చేసుకున్న .

No comments: