Monday, September 7, 2009

మీరైతే ఏమి చేస్తారు ?

చుట్టుపక్కల పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మండల ఆఫీసు వైపు అడుగులు వేస్తున్న,అక్కడ మీటింగ్ ఉన్నదని చప్పడంతో బయలుదేరెను అందరు ముందే వేల్లిపోయినట్లున్నారు . నేను వేరేఉరునుంచి రావాలి ఒక్కదాన్నే బస్ దిగెను .రోడ్ నుంచి 2km పొలాల్లోకి నడవాలి ,మట్టి రోడ్ వేసిఉంది.పచ్చాటిపోలాల మధ్యలో ఆ ఆఫీసు కట్టేరు .నవంబర్ నెల వరి చాల ఏపుగా ఎదిగి ఉంది ,పోలంలోపనిచేసేవాళ్ళు చాల దూరంలో ఉన్నరు .పొలాలను చూస్తూ నడుస్తున్నాను దాదాపురోడ్ కి మండల ఆఫీసుకి మధ్యకి వచ్చా ,అనుకొకున్దచూపు రోడ్ మీద పడింది ,పెద్ద నాగుపాము నాకు కొన్ని అడుగుల దూరంలో ఇవతలిపోలం నుంచి అవతలిపోలంలోకి వెలతానికి రోడ్ దాటుతుంది .నాపై ప్రాణాలు పోయయనుకున్న అక్కడే ఆగిపోయా !అది రోడ్ మధ్యలోనే ఆగిపోయింది .ఏమిచెయ్యాలి ?వెనక్కిపరుగు పెడదామంటే రోడ్ చాల దూరం లో ఉంది ,అది వెనకాల వస్తే నాకన్నా స్పీడ్గా వస్తుంది .చుట్టూ చుస్తే దురంగాపనిచేసేవాళ్ళు చేతులతో సైగ చేస్తున్నారు ,వాళ్ళకి అర్ధమయింది .ఆఫీసు నుంచి కూడా అందరు బయటకు వచ్చి చేతులు ఉపుతున్నారు కాని రక్షించటానికి ఎవరు రావడంలేదు .చమటలు పట్టేయి ,నపనియిపోయింది అని దేవుడిని తలుచుకుంటూ కథలకుండా నిలబడ్డ .
ఇదు నిముషాలు గడిచి ఉంటాయి అది స్లో గ కదులుతుంది నా వైపు రాకుండా పక్కనున్న పొలంలోకి వెళ్ళింది ,అప్పుడు గమనించ అక్కడ పెద్ద పుట్ట ఉంది ,అక్కడకు చేరుకుని పుట్టచుట్టు చుట్టుకుని పడగవిప్పి ఆడుతుంది నేను పరుగో పరుగు ........
అప్పుడు అందరు వచ్చి నన్ను చుట్టూ ముట్టరు ,అప్పుడు వచ్చాయి నకల్లలోని నీరు పటపట రాలాయి ,ఎంతగండం గడచింది .కానీ అందరు చాల గొప్పగా చుసేరునన్ను !ఎంత అదృష్టవంతురాలవు ,నాగేంద్రుడు కనిపించేడునీకు ,పుణ్యం చేసుకున్నవు అన్నరు .
ఇంతకి ఆఉరులో పెద్ద నాగు తిరుగుతా ఉంటాదంట ,కాని ఎవరికీ కనిపించదంతా ,ఒక్క పూజారికి కనిపిస్తుందంట్ట .ఉరిచివర పెద్దపుట్ట, దానికి ఎప్పుడో గుడి కట్టరంతా పొలంలో ఉన్నా పుట్టలోపలనుంచి అక్కడ ఉన్నా గుడి పుట్టలోకి వెళ్ళు తుంది అనిచేప్పేరు .అందుకే నేను ఆగి పోయేసరికి అందరికి అర్థమయిపోయిందంతా .
మీటింగ్ అయ్యాక గుడికి వెళ్ళమన్నారు !వెళ్ళకపోతే మల్లి ఎక్కడ కనిపిస్తాడేమో అని గుదికివెల్లి బ్రతుకు జీవుడా అనుకుంటూ తిరుగు ప్రయనమయ్య ...............

11 comments:

చిన్ని said...

very interesting story

విశ్వ ప్రేమికుడు said...

నేనూ చిన్నప్పుడు ఓ సారి స్కూలు నుండి గబ గబా ఇంటికి వెళుతున్నాను. ఇంతలో ఓ చిన్న నాగు పాము పిల్ల పడగవిప్పి రోడ్డు దాటుతోంది. కొద్దిగా ఉంటే నా కాలు దానిమీద వేసే వాడిని. అది బుస్ మని నాకేసి చూసింది. నా గుండెలు జారినంత పనైంది. కాలు వెనక్కి తీసాను. కాసేపు నాకేసే చూస్తూ వెళ్లి పోయింది.

మేము చిన్నప్పడు పాములు బాగా తిరిగే చోటులో ఇల్లు కట్టుకుని ఉన్నాము. ఇలాంటివి మాకు చాలా అనుభవాలు ఉన్నాయి. మేము పాముకి P.N.రాజు (పక్కింటి నాగరాజు) అని పేరు పెట్టుకున్నాము. అవి తరచూ మా ఇంటిని సందర్శిస్తుండేవి.

నా పాత ఙాపకాలను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు. :)

విశ్వ ప్రేమికుడు said...

వీలైతే ఆ వర్డ్ వెరిఫికేషన్ తొలగించ గలరు.

చిన్ని said...

word verification chiragga vundhi ...daani samgati chudandi

anagha said...

@chinnigaru
dhanyavadhalu.

anagha said...

@vishva premikudu
thanks.
goppa manasuthopatu goppa dhiryavanthulukudana ,PN RAJU tho friendship ante matala....
inthaki word verification ela tholaginchalo cheppandi.

విశ్వ ప్రేమికుడు said...

మీ పోస్టులకు వ్యాఖ్య రాసినపుడు కొన్ని ఆంగ్ల అక్షరాలను నిర్ధారణ కోసం రాయమని అడుగుతుంది. దానినే పదనిర్ధారణ లేదా వర్డ్ వెరిఫికేషన్ అంటారు.

అది వ్యాఖ్యలు రాసే వారికి కాస్త విసుగొచ్చే విషయం. ఎందుకంటే తప్పుగా టైపు చేసినా, టైపు చెయ్యడనికి కాస్త ఎక్క్కువ టైం తీసుకున్నా మళ్లీ ఇంకో పద నిర్ధారణ అడుగుతుంది. దాని అవసరం అంత లేదని నావుద్దేశం.

ఒక వేళ అది మీరు తొలగించలి అనుకుంటే మీ డాష్ బోర్డుకు వెళ్లి మీ బ్లాగు ---- సెట్టింగులు ---- నొక్కండి. అక్కడ మీకు వరుసగా ప్రాధమిక, ప్రచురణ, ఆకృతీ కరణ, వ్యాఖ్యలు....... మొదలైన ఆప్షన్స్ వస్తాయి.

అందులో వ్యాఖ్యలు అనే చోట నొక్కండి. అప్పుడు వ్యాఖ్యలకు సంబంధించిన సెట్టింగులు వస్తాయి. అందులో క్రిందినుండి 3 వ ఆప్షన్ పదనిర్ధారణ చూపాలా వద్దా అని అడుగుతుంది. మీరు వద్దు నొక్కండి. తరువాత క్రింద గానీ పైనగానీ ఉన్న సెట్టింగులను సేవ్ చెయ్యి నొక్కాలి. అంతే....

ఆడవళ్లు చాలా మంది ఇతరులు రాసిన వ్యాఖ్యలను ముందుగా తాముచూసిన తరువాతే అవి ప్రచురిస్తారు. ఎందుకంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా రాసేవారూ ఉంటారు మన బ్లాగరులలో... కనుక అటువంటి సెట్టింగులు చేసుకుంటారు. మీరుకూడా అలా చేయాలంటే అదే పుటలో ( పేజీలో ) క్రిందినుండి 4 వ ఆప్షన్ చూడండి.

ధన్యవాదాలు.:)

anagha said...

@viswa gariki dhanyavadhalu.

భాస్కర్ రామరాజు said...

>>ఏపుగా ఎదిగి ఉంది
ఏపుగా పెరిగిందీ అంటారు, ఏపుగా ఎదిగిందీ అనరౌ పంటని.
బాగుందీ మీ పాముతో ముఖాముఖీ.
నేనూ రాసాను పాపుల గోలని. ఓ లుక్కేయండి వీలుంటే.
http://ramakantharao.blogspot.com/2008/08/blog-post_25.html
http://ramakantharao.blogspot.com/2008/08/blog-post_26.html

anagha said...

@ramaraju
dhanyavadalu.
perigindi ane antaru ,kani vaduka bhaashalo yedigindi ani palleturulo antaru.

చిన్ని said...
This comment has been removed by a blog administrator.