Thursday, October 29, 2009

తోట కూర కథ



               నేను నా పనులతో బిజీగ ఉన్నాను.అమ్మ దగ్గరనుంచి ఫోన్ 'నేను చెప్పిన విషయం కనుక్కున్నావా ?'అని అమ్మ అడిగింది .'అయ్యో! కనుక్కోలేదు ,ఇప్పుడే కనుక్కుంటాను' అని చెప్పెను .మూడు రోజుల్లో అమ్మ  పుట్టినరోజు వస్తుంది ,ఆరోజు వృద్ద ఆశ్రమంలో భోజనాలు పెట్టించాలి అని .నాన్నగారు ,అమ్మ వారి పుట్టిన రోజున అల పెట్టించడం అలవాటు .నా పనులు పక్కన పెట్టి బుక్ చెయ్యడానికి  వెళ్ళాను.నెల ఆఖరువరకు అన్ని డేట్స్ బుక్ అయిపోయంట.వేరే ఓల్డ్ ఏజ్  హొమ్స్ కి ఫోన్ చేశా ,అక్కడ బుక్ అయిపోయంట .నెక్స్ట్ మంత్ అయితే ఇస్తామన్నారు(మనకి కావాల్సింది అక్టోబర్         పద్దెనిమిది)ముందేవెళ్లివుంటే బాగుండు  అనుకున్న,నాకేంతెలుసు  దాతలు ఎక్కువైపోయారని.ఒకవైపున మనుషుల్లో స్వార్ధం ఎక్కువైంది అనుకుంటున్నాము  కానీ  మానవత్వం కూడా పెరిగిందన్నమాట (మరి ఓల్డ్ ఏజ్ హోమ్స్ఎందుకు పెరుగుతున్నాయి?)

                                     అమ్మని నిరాసపరచడం  ఇష్టంలేక అన్ని చోట్ల కనుక్కున్న ,పోనీ అబ్సేర్వషన్ హోం లోఇస్తే! కనుక్కుందాం అనుకున్న,ఫోన్ చేస్తే వాళ్ళు ఓకే  అన్నారు . అమ్మకూడా ఒప్పుకుంది.


                                  పద్దెనిమిది సంవస్తసరాల వయసు లోపు పిల్లలు నేరం చేస్తే ఈ హోం లో ఉంచుతారు .వారిని కొట్టకుండా, తిట్టకుండా,బేడీలు వేయకుండా పోలీసులు సివిల్ డ్రెస్ లో హోమేకి తీసుకు వస్తారు .పోలీసులు కొట్టారని తెలిస్తే వారిమీద ఎక్షన్ తీసుకోవడం జరుగుతుంది .ప్రతి వారం ఒక రోజు అక్కడే కోర్ట్ నిర్వహిస్తారు .జడ్జి ,సైకాలజిస్ట్ ,సోషియలజిస్ట్,ఒక బెంచ్ గ కుర్చుని కేసు ని పరిశిలిస్తారు,బెయిల్ ఇస్తారు ,కేసు బట్టి కొంతమందికి బెయిల్ రాదు .నేరం రుజువైతే వారిని వైజాగ్ ,తిరుపతి ,హైదరాబాద్లో ఉన్న స్పెషల్ హోం కి పంపిస్తారు .అక్కడ వారికీ చదువు ఒకేషనల్ ట్రైనింగ్స్ఇస్తారు .కౌన్సిలింగ్ ద్వార వారిలో మార్పు తీసుకు రావడనికి ప్రయత్నిస్తారు . ఆరోజే నేను వెళ్లి ఎంతమంది ఉన్నారో చూసి వారికీ ఏమి స్పెషల్ కావాలో అడిగి తెలుసుకిని ఆర్డర్ చేసి వచ్చెను .                                                                                     
             అమ్మపుట్టినరోజునా ,మాకు అమ్మచేసినలడ్డులు ,సున్నుండలు ,గారెలు,సేమ్యా ,పంపించింది మా సిస్టర్స్, బ్రదర్స్ వేరే ప్లేసెస్లో ఉన్నారు .నేను మాత్రం అమ్మవాళ్ళ కి దగ్గరలోనే,వాళ్ళ కాలనీలోనే ఉంటున్నాము .మా అత్తా గారువాళ్ళు ఆ కాలనీలోనే ఉంటారు .ఎవరికి ఏ అవసరం వచ్చిన వెంటనే నాకు ఫోన్ వస్తుంది .వాళ్లపనులు చూసేక న పనుల్లోకి వెళతాను .

                     అమ్మని తీసుకుని అబ్సేర్వషన్  హోం కి వెళ్ళెను .అది  రెం డు అంతస్తుల ఇండిపెండెంట్ హౌస్ ,గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీసు ,స్టాఫ్ ఉంటారు .పైన పిల్లలు ,బయటకు వెళ్ళకుండా అంత సెక్యూరిటీ ఉంటుంది .పిల్లలందరూ యునిఫోం లో ఉన్నారు .మాకోసం ఎదురు చూస్తున్నారు.ప్రోబెస్షనరీ ఆఫీసర్ వచ్చి విష్ చేసి ఆహ్వానించేరు .పిల్లలందరూ వచ్చి వరుసగా కూర్చున్నారు.మమ్మల్నిపరిచయంచేసేరు,దాదాపుపాతికమందిదాకఉన్నారు .అందరు ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు ,వాళ్ళందరిని పరిచయం చేసుకోమంటే సిగ్గ్గుపడుతూ తలవంచుకున్నారు దగ్గరకు పిలిచి భుజం చుట్టూ చేతులు వేసి హోం లో ఎలా చూస్తున్నారు ,ప్రోబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాను ,దానితో  వాళ్ళు ఫ్రీ అయిపోయి అన్ని కబుర్లుచెప్పేరు ,అన్ని జిల్లాల వాళ్ళు ఉన్నరు .నలుగురు మాత్రం అనాధలు ,మిగతా వారికీ తల్లి దండ్రులు ఉన్నారు .ఇంటిలో సరిగ్గా చదవట్లేదని తిడితే కోపమొచ్చి వచ్చేసినవాళ్ళు ,తండ్రి బాగా తాగి ,కొట్టి ఇంటిలో గొడవ చేస్తుంటే ఉండలేక వచ్చేసిన వాళ్ళు ,చెడు స్నేహితుల వల్ల వచ్చేసినవాళ్ళు కొందరు ,చిన్నప్పుడే పనిలో పెడితే ఇష్టం లేకే పారిపోయి వచ్చినవాళ్లు .వీళ్ళందరూ గాంగ్ చేతుల్లోపడిదొంగతనాలు చెయ్యడం,సొంతంగా డబ్బు అవసరమొచ్చి కొంతమంది , డ్రగ్స్ కోసం కొంతమంది  ,వీళ్లు ఎక్కువగా తీసుకునే డ్రగ్స్, వైట్నర్ సోలుషన్ ,ఖైని ,ఇంకా ఏవో పేర్లు చెప్పేరు.వాళ్ళ  పేరెంట్స్ గురించి చెప్పుత చాలమంది ఏడ్చేరు .నేను వాళ్ళందరికీ గ్రూప్ కౌన్సిలింగ్ ఇచ్చెను. అందరిలో చిన్నవాడు సందీప్ ,వయసు పన్నెండు  ,చిలకలూరిపేట .దగ్గరకు పెలిచాను ,ఫ్రెండ్లీగా మాట్లాడ ,అతని పైన ఇదు కేసులు ఉన్నాయంట .'ఎందుకు దొంగతనం  చేసేవు '?అని అడిగితె !'పక్కింటి అన్న సినిమాకి తీసుకువెళతాను అని చెప్పి వేరే  వూరు తీసుకు వెళ్లి దొంగతనం చేయిన్చేడు'అని చెప్పేడు  .ఇంటికి వెళ్లి పోతాను పంపించెయ్యండి అనిఎద్చేడు.చాలచక్కగాఉన్నాడు ,వాడినిచుస్తేజాలి    వేసింది .వాడిని చూసి అమ్మ బాధపడింది .'తల్లి దండ్రుల పెంపక లోపం వలెనే వీరి బంగారు భవిష్యత్ నాసనమయ్యింది .పసి మొగ్గలు ,లేత మొక్క ఎటు వంచితే అటు వంగుతుంది ,ఇప్పటికయినా వీరిలో మార్పు వస్తే బాగుండు అంది' పిల్లల కు తోట కూర కథ చెప్పింది.ఇది అందరికి తెలిసిన కధే,స్కూల్లోమోరల్  సైన్స్ క్లాస్లో కూడా చెప్పేవారు . .అమ్మ మా చిన్నపుడు ఈ కధ చాలాసార్లు చెప్పింది ,రాత్రి పూట భోజనాలు చేసేటప్పుడు,ఇలాంటినీతికథలు,,మర్యదలగురించిఅన్నిచెప్పేది ,ఇప్పటికి ఆ కధలన్నిగుర్తున్నాయి .                                      ఒకపిల్లవాడు ,వాళ్ల ఇంటికి వచ్చిన కూరగాయల అమ్మి దగ్గరనుంచి తెలియకుండా తోటకూర దొంగ తనం చేసేడు.కురగాయలామ్మి వెళ్ళిన తరువాత ,వాళ్ల అమ్మకు చూపించేడు '.అరె!మేము అక్కడే ఉన్నము ఎలా తీసేవు ?'అని అతని చాకచక్యాన్నిమెచ్చుకుంది .అప్పట్నుంచి చిన్న దొంగ తనలు చేస్తా ,పెద్ద గజ దొంగ అయ్యేడు .యావజ్జీవ శిక్ష పడితే ,జైలు కి వెళ్లి తల్లి బోరున ఎడ్చిన్దంట.అప్పుడు కొడుకు 'ఎందుకు ఏడుస్తావమ్మ! ,నేను తోటకూర దొంగతనం చేసినప్పుడే నువ్వు మందలిస్తే నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు'అన్నాడు. 'చూసేరా !సరదాగా చేసిన చిన్న దొంగతనము వాడి జీవితం ఎలా నాసనమయ్యిందో ,మీరు ఇంకా చాల చిన్నోళ్ళు ఇప్పటికయినా మీరు మారితే మీ జీవితాలు బాగుంటాయి' అని కథ ముగించింది . పిల్లలందరూ శ్రద్దగా విన్నారు .బయటకు వెళ్ళినాక మేము మంచి గ ఉంటామని మాట ఇచ్చేరు .అప్పుడప్పుడు వస్తా ఉండమని అడిగేరు ,మీరు మారతను అంటే తప్పకుండ వస్తాను అని చెప్పెను . తరువాత వారందరికి భోజనాలు వడ్డిచ్చేరు.స్పెషల్ భోజనం స్వీట్స్ ,చికెన్ బిర్యాని ,ఫ్రూట్స్ .వాళ్ళందరి కళ్ళలో కృతజ్ఞత ,ఆనందం .వారిదగ్గరసెలవు తీసుకుని   వచ్చేసేము.                                                                                                                        

17 comments:

anagha said...

@విశ్వ గారు ,ధన్యవాదాలండి.

విశ్వ ప్రేమికుడు said...

అమ్మయ్య మొత్తనికి అవిడియా పని చేసిందన్నమాట.

టపా బగుంది. నాకు అలాంటి అబ్సర్వేషన్ హోంస్ భాగ్య నగరంలో ఎక్కడుంటాయో చెప్పగలరా...?

పోనీ మీరు ఏ ఊర్లో ఈ పిల్లల్ని కలిశారు? అలా ఎవరైనా వాళ్లని కలవవచ్చా..? లేదా దానికి ప్రత్యేక అనుమతులు కావాలా...? వాళ్లకు నెలలో ఒకటి రెండు సార్లు పంచతంత్రం లాంటి కథలు చెప్పాలని ఉంది. అది కుదిరే పనేనా..?

cartheek said...

అనఘ గారు మీపేరు లానే మీ మనసు కూడా ఎంత నిర్మలమైనదో మీరుచేసె కార్యక్రమాలే తెలియజేస్తున్నాయండి......

అన్నట్తు అమ్మకు నా కృతజ్ఞతలు..................
చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు .....

anagha said...

@విశ్వ గారు ,ఎవరైనా వెళ్ళవచ్చు మీకు సేవ చేయాలని ఉంది కాబట్టి తప్పకుండ ఒప్పుకుంటారు .మన ఆంధ్రలో నాకు తెలిసి తొమ్మిది హొమ్స్ఉన్నాయి .భాగ్యనగరంలో బాయ్స్ కి చంచలగుడలో ఉంది ,పూర్తి అడ్రెస్స్ కావాలంటే కనుక్కుని చెప్పుతాను .

anagha said...

@కార్తిక్ గారు ,ధన్యవాదాలు .అందరు చేస్తారు ,కాకపోతే అలంటి కార్యక్రమాలు నేను ఎక్కువ చేస్తాను ,నాకు చాల హ్యాపీగ ఉంటుంది .

cartheek said...

అనఘ గారు
నాదో చిన్న కోరిక మీ బ్లాగుకు నా బ్లాగులో లంకె వేసుకొవచ్చా......
మీ అనుమతికోసం ఎదురుచూస్తుంటాను.

anagha said...

@karthik garu, o.k

Telugu Movie Buff said...

అభినందనలు అనఘగారు. హర్షించదగ్గ, స్ఫూర్తినిచ్చే పనులు ఎన్నో చేస్తున్నారు.
నిజంగా చిన్నప్పుడు తెలియకో, సరదాకో చేసే పనులు అలాగే కొనసాగితే జీవితం మీద ఎంత ప్రభావం చూపుతాయో!

anagha said...

@ఫణి గారు ధన్యవాదాలు ,అవునండి బాల్యం పునాది లాంటిది .

విశ్వ ప్రేమికుడు said...

మీకు వీలుంటే నాకు ఆ చంచల్ గూడా హోం అడ్రెస్ చెప్పండి. లేదా ఏదైనా ఫోన్ నెంబర్ తెలియజేయండి.

శేఖర్ పెద్దగోపు said...

అభినందనలు అనఘ గారు..మీరిలాగే మంచి మంచి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆశిస్తున్నాను. అమ్మకి ప్రత్యేకంగా అడిగానని చెప్పండి. బిలేటెడ్ బర్త్ డే విషేస్ తెలియజేయండి.

anagha said...

@శేఖర్ గారు, నా బ్లాగ్ ని దర్శించినందుకు ధన్యవాదాలు,అమ్మకు తప్పకుండ తెలియ చేస్తాను.

SIMHA said...

mee experiences chala bagunnay

anagha said...

@సింహగారు,ధన్యవాదాలండి.

తృష్ణ said...

ఇప్పుడే చూశానండి. టపా, అబ్జర్వేషన్ హోమ్కు వెళ్ళే ఐడీయా రెండూ బాగున్నయి.

Telugu Movie Buff said...

ధన్యవాదాలు అనఘ గారు.
మీకు కూడా నూతన సంవత్సర శుభాకంక్షలు

anagha said...

తుష్ణ గారు ,
ధన్యవాదాలు.