Sunday, February 14, 2010

ప్రేమ ........

                                                          ప్రేమికుల రోజు శుభాకాంక్షలతో ......
                       
                                     ప్రేమనేది లేకుండా మనిషి బ్రతకలేడు.తల్లిదండ్రులుగాని  ,తోబుట్టువులుగాని  మనల్ని ప్రేమతో చూడాలని కోరుకుంటాము .కుటుంబములోసరైన  ప్రేమదొరకపోత ,ఎవరైనా బయటవారు అప్యాంగా మాట్లాడితే చాలు  త్వరగా ప్రేమలో పడిపోతారు .
                                       ఈ రోజుల్లో ప్రేమికులు దౌర్జన్యంగ వ్యవహరిస్తున్నారు ,ఒకమ్మయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కూడా ఇష్ట పడాల్సిందే,లేకపోతె హతమారుస్తున్నారు .అది నిజంగా ప్రేమేనా ?అది అసూయా ,నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదు ,ఉన్మాదులుగా తయారు అవుతున్నారు.
                             ఇంతాచేసి ,పోనీ ఒప్పుకుని పెళ్ళిచేసుకుంటే ,కలకాలం సంతోషంగా జీవిస్తున్నార ?ఈ రోజు పెళ్లి ,సంవస్త్సరం లోపే పెటాకులు .పెద్దలు కూడా వంత పాడుతున్నారు .ఇంకా వాళ్ళకు పుట్టిన పాపానికి బాదితులు వారి పిల్లలు                     
                   నాదృష్టిలో నిజమైన ప్రేమికులు ,చివరిదాకా సంతోషంగా కలసి జీవించినవాళ్ళు.షాజహాన్ ,ముంతాజ్ నిజంగా అద్బుతమైన ప్రేమికులు .పద్నాలుగు మంది పిల్లలు పుట్టిన తరువాత ఆవిడ చనిపోయింది, అప్పటికి వాళ్ళు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు .ఆవిడా చనిపోయిన తరువాత తొమ్మిదిరోజులు గది తలుపులు తీయకుండా పచ్చి మంచినీరు కూడా తాగ లేదంట .ఆవిడా ఎంత ప్రేమ అందించకపోతే, షాజహాన్ చివరిరోజుల్లోకుడా తాజ్ మహల్ చూస్తూనే ప్రాణం వదిలేడు.

                           భాగమతి, కులికుతుబ్ ల ప్రేమ కూడా అద్భుతం, నిజమైన ప్రేమికులంటే వీరే .ప్రేమికులందరూ వీరిని ఆదర్శంగా తీసుకుని చివరివరకు కలిసి  జీవిస్తే బాగుంటుంది .
                            నాకైతే , ఏ జంట విడిపోయిన బాధవేస్తుంది ,జంటలు విడిపోయే సినిమాలను చూడను ,కథలైతే చదవను .
                                

5 comments:

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

భాస్కరన్న ద్వారా మీబ్లాగు పరిచయం అయ్యింది. మీరు పుట్టినరోజు పెన్నుపోగొట్టుకున్న టపాచదివాను. బావుంది. అన్నట్టు శీర్షిక "గోదావరి" అని తెలుగులో పెట్టుచ్చుగా?

కెక్యూబ్ వర్మ said...

ప్రేమపైన మన కుటుంబ వ్యవస్థలోనే సరైన అవగాహన లేదు. కులాలు, మతాల పేరుతొ విడి విడిగా వున్నా సమాజంలో ప్రేమపై చాలా ఆ౦క్శలు౦టున్నాయి. ఇప్పుడున్న సమాజంలో అది మరింత ఆర్తికాంసాలతో ముడిపడిపోతో౦ది. యువహృదయాలపై చాలా రకాల ప్రభావాలతో ప్రేమ ఒక Trash గా మారింది. సరైన అవగాహన లేక, ఆలోచన లేక యువతరం దారితప్పుతోంది. కాదంటారా? నిజమైన ప్రేమ ఎక్కడో...

anagha said...

సుబ్రహ్మణ్యం గారు,వర్మగారు ,కంప్యూటర్ ప్రాబ్లం వలన ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి .
సుబ్రహ్మణ్యం గారు ,
మీరు నా బ్లాగ్ని విజిట్ చేసినందుకు ,టపాలు చదివి స్పందించిన్నందుకు ధన్యవాదాలు.
వర్మగారు ,
కుటుంబ వ్యవస్థలో ప్రేమ పై సరైన అవగాహన ఎందుకు లేదండి ?ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఉన్న ప్రేమానురాగాలు ,ఇప్పుడు లేవు .

మురళి said...

దురదృష్టవశాత్తూ చాలామంది తాము ప్రేమించుకుంటున్నాం అనుకుంటున్నారు.. ఈ అనుకోడం వల్లనే చాలా వరకు సమస్యలు, స్పర్ధలు.. బాగుందండీ టపా..

anagha said...

@మురళి గారు,
ధన్యవాదాలు ,
మీరు అన్నది నిజమేనండి .