Thursday, September 24, 2009

snehitudu

 అది నేను ముడో తరగతి చదివేరోజులు. ఖమ్మం జిల్లాలో ఉండేవాళ్ళం. భద్రాచలానికి దగ్గరే అడవి ప్రాంతంలగుండేది .రొండు ఇళ్ళు కలిపి జంటగా ఉండేవి ,మళ్ళికొంచందూరంలోరొండో ఇల్లు ,ప్రహరీబదులు ,రేగు, జామ ,సీతాఫలం  చెట్లు ఉండేవి .ఎలా వచ్చేవో ,మా పెరట్లోకి నెమళ్ళు ,లేళ్ళు వస్తుండేవి .ఇంటి ముందు పెద్ద మైదానంలా కాళి స్థలం ఉండేది .నాన్నగారి బదిలీవలన అన్ని వూర్లు తిరగాల్సి వచ్చేది . ఊరు మాత్రం నాకు చాలానచ్చింది .కొత్తగా స్కూల్ లో జాయిన్ అయ్యాను,నా తో పాటు పెద్ద తమ్ముడిని (బాబోయ్ !వాడు మహా పెంకి వాడు లెండి)స్కూల్లో జాయిన్ చేసేరు .వాడేమో అమ్మకి ముద్దుల కొడుకు స్కూల్కి వెళ్లనని రోజు పేచి ....రిక్షాలోంచి దూకేసి పరుగు పెట్టేవాడు .రిక్షావాడు తమ్ముడు వెనకాల పరుగు,తమ్ముడు తనకు వచ్చిన భాష లో అతన్ని తిట్టటం ,కొట్టడం ,ఎలాగోలా స్కూల్కి తీసుకెళ్లడం లేట్ అవటంతో నన్ను బెంచి మీద నిలబెట్టేవారు .అలా చాలసార్లునిలబడాల్సివచ్చేది. నా చదువు సంగతి దేవుడెరుగు వాణ్ని అదుపు చెయ్యటానికే సమయం గడిచిపోయేది....ఇలా వాడి తో నా పాట్లు చాలానే ఉన్నాయ్లెండి.





ఊరికొచ్చిన కొద్దిపాటి రోజులలోనే ఇళ్ళ పక్కపిల్లలందరం  పెద్ద గ్యాంగ్ గా తయారయ్యాం .కాని వారందిరిలో పక్కింటి బాబ్జీ ..కుడి పక్కింటిలో సాగర్ తో ఎక్కువ ఆడుకునేదాన్ని.అందరం కలిసామంటే ఇంక మా అల్లరికి , ఆటలకి కొదవే లేదు .ఎన్నాటలో ......దాగుడు మూతలు ,కలర్ కలర్,నేలా బందా ,మా తా ఉత్తరం ,...........ఇలా ఎన్నో.ఎప్పుడైనా వర్షం కురిసి వెరిసిందంటే చాలు మా గ్యాంగ్ అంటా మైదానంలో కి చేరి ..... మట్టి లో ఎన్నో బొమ్మలు గీసేవాళ్ళం .అందరికంటే సాగర్ అద్భుతంగా గీసేవాడు.వాడు బాగా గీస్తాడన్న్న అసూయతో సాగర్ చెల్లి శాంతి దాన్ని తుడిపేసేది.దానితో కోపం వచ్చి సాగర్ శాంతి ని బాగా తిట్టాడు.అది ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది .మర్నాడు సాగర్ చొక్కా లేకుండా తిరగడం గమనించా . ఏమి అయ్యిందా ఆరా తీస్తే .........శాంతి వెళ్లి వాలన్నయ్య మీద చాడీలు చెప్పింది,దాని పర్యవసానం తెల్లటి వీపు   మీద ఎర్రటి ,వెడల్పాటి వాతలు,దానిమీద రాసిన ఆయింట్మెంట్ .సాగర్ వాళ్ళ  నాన్నగారు శాంతి ఏమిచెప్పినా నమ్మేసి ఇలా కొడతాడంట .నాకు మా ఫ్రెండ్స్ అందరికి చాల బాద వేసింది ,అందులో మా ఆటలకు బ్రేక్ ,అప్పటినుంచి శాంతి అంటే మాకు కోపం .అప్పుడప్పుడు సాగర్ మాకు అలాగే దర్సనం ఇస్తుండేవాడు .వాళ్ల నాన్నగారు పెద్ద ఆఫీసర్ , చూస్తాకి మంచివారి లాగా   వుండేవారు .మేమందరం వాళ్ల ఇంటికి వెళ్లి నప్పుడు వాళ్ల అమ్మ మమ్మల్ని పలకరించి తినడానికి స్వీట్స్ ఇస్తుండేవారు .సాగర్ అల్లరిచేసేవాడు కాదు,బాగా చదేవేవాడు .బాబ్జికి ,నాకు సాగర్ మీద జాలి ఉండేది.నెక్స్ట్ ఇయర్ బదిలిమీద వేరేఉరు వేల్లిపోయము .ఇప్పటికి ఆరోజులు గుర్తుకు వస్తుంటాయి ,ఎవరయినా వాళ్ల పిల్లలని కొడుతుంటే చాల కోపమువస్తుంది ,బాదవేస్తుంది వెళ్లి అడ్డుకుంటాను .




చాల మంది భార్యమీద కోపాన్ని ,భర్త మీద కోపాన్నిపిల్లలమీద చూపిస్తారు .మా పెద్దమ్మగారి అబ్బాయి (అన్నా)వాళ్ల ఆవిడా మీద కోపం వస్తే భయంకరంగా పిల్లలని కొట్టేవాడు ,వాళ్ల పిల్లలయినంత మాత్రాన కొట్టటానికి ఎవరికి హక్కు లేదు .అల్లాంటి వాళ్ళను దేముడే మార్చాలేమో !

10 comments:

Hima bindu said...

మీ జ్ఞాపకం బాగుంది ...నాకు వచ్చే కామెంట్స్ మీకు రావడం ఏమిటో చెబుతారా ....మీరు ఏ ఊర్లో వుంటారు ?అభ్యంతరం లేకపోతె చెప్పగలరు .

anagha said...

@ధన్యవాదాలు .
తప్పకుండ చెపుతా.

Bhãskar Rãmarãju said...

హ్మ్!!
నిజమే!! ఎవరెవరిమీద కోపాన్ని పిల్లపై చూపటం రాక్షసత్వం. దమ్ముంటే ఎవరిపై కోపం ఉంటె వారిపైనే చూపుకోవాలి.

వర్డ్ వెరిఫికేషన్ తీసేయమ్మా!!

anagha said...

@ramaraju garu,
chala rojula tharavatha nablogni dharsinchinanduku dhanyavadalu.

. said...

అనఘ గారు మీరూ నాలానే కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చేసినట్టున్నారు చూసానండి మీ రచనలు అన్నీ బాగున్నాయి
మీ జ్ఞాపకాలూ పంచుకోవడం కూడా బాగుంది...
కాక పోతే మీఏమి అనుకోకూడదు ఒక్క మాట
మీరు కామెంట్స్ లో తెలుగు తప్పులున్న పర్వాలేదు కాని
మీ పోస్ట్ లలో మాత్రం తెలుగు తప్పులు దొర్లకుండా చూసుకోండి అంతే ఇంకా మీరే నంబర్ వన్.

anagha said...

@ కార్తీక్ గారు ,
ధన్యవాదాలు ,మీ సూచనలు తప్పక పాటిస్తాను ,కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం కొంచం కష్టమే .

Telugu Movie Buff said...

అనఘ గారు, సంఘ సేవ చెయ్యాలన మీ అభిరుచికి అభినందనలు. మొదటిసారి అనుకోకుండా మీ బ్లాగ్ కి వచ్చాను.
"వరద ముంపు గ్రామాల్లో మా పర్యటన" పోస్ట్ కు కామెంట్ రాద్దాం అని ప్రయత్నించాను. ఎందుకో పని చెయ్యలేదు.
అందుకే ఇక్కడ రాసాను.

అంతటి ప్రమాదకర పరిస్థితిలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్లి, వరద బాధితులకు మీరు చేసిన సహాయానికి మీ మిత్రులందరికీ జోహార్లు. దోపిడీ దొంగలకు భయపడి ఇంటిని విడిచి వెళ్ళాక, ప్రాణాలను తెగించిన వారి పరిస్థితిని చూసి చాల బాధ అనిపించిది. నిజంగా ఎంతటి దౌర్బాగ్యం.

anagha said...

@ఫణి గార్కి ,
ధన్యవాదాలు ,కామెంట్ దగ్గర క్లిక్ చేస్తే పనిచేయ్యడంలేదు ఎందుకో నాకు అర్థం కావడంలేదు .

Bhãskar Rãmarãju said...

anagha -
You guys are awesome. Somehow I cannot comment on the that post, but, please accept my regards.

God Bless you all!!!

anagha said...

@రామరాజుగారు , ధన్యవాదాలు.మీ డౌట్ ఏంటో చెప్పండి .